ఇలాంటి యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయవద్దు: కేంద్రం హెచ్చరిక

By సుభాష్  Published on  23 Sept 2020 9:31 AM IST
ఇలాంటి యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయవద్దు: కేంద్రం హెచ్చరిక

ఈ రోజుల్లో ఫేక్‌ యాప్స్ వల్ల ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. కొన్ని యాప్స్‌ వల్ల ఎన్నో సైబర్‌ నేరాలు జరుగుతున్నాయి. కేంద్ర తన సైబర్‌ ఆవేర్‌నెస్‌ ట్విట్టర్‌లో హ్యాండిల్‌లో ఓ హెచ్చరిక జారీ చేసింది. స్మార్ట్‌ ఫోన్లు వాడే వారు తెలియని యూఆర్‌ఎల్‌ (URLS) నుంచి వచ్చే ఆక్సీమీటర్‌ యాప్స్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవద్దని ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ యాప్స్‌ మనుషుల శరీరంలో ఎంత ఆక్సిజన్‌ ఉందో చెబుతుందని, అవి దొంగ యాప్స్‌ అని వీటిని నమొద్దని, పొరపాటున వీటిని మీ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే మీ వ్యక్తిగత సమాచారం, మీ ఫోటోలు, మీ వీడియోలు, కాంటాక్ట్‌ నంబర్లు, పాస్‌వర్డ్‌లు దొంగిలిస్తాయని కేంద్రం హెచ్చరిస్తోంది. ఈ ఫేక్‌ యూఆర్‌ఎల్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసినట్లయితే మీ వ్యక్తిగత సమాచారం మొత్తం దొంగిలించబడుతుందని, చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఈ యాప్స్‌ ద్వారా మొబైల్‌లో ఏ ఇంటర్‌నెట్‌ సెర్చ్‌ చేస్తున్నారో, ఏ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు.. ఎలాంటి చాటింగ్‌లు చేస్తున్నారు వివరాలన్ని హ్యాకర్లకు అందిస్తాయి. ఇవి మీ వేలిముద్రలు, స్కానింగ్‌ వంటి డేటాను కూడా హ్యాకర్లకు పంపిస్తాయి. కొన్ని యాప్స్‌ బయోమెట్రిక్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ కూడా అడుగుతాయని కేంద్రం హెచ్చరిస్తోంది.

కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చాలా మంది ఆక్సీమీటర్లు కొనుగోలు చేస్తున్నారు. వ్యాధి సోకిన వారిలో రక్తం ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గితే ఆక్సీ మీటర్‌ ద్వారా వెంటనే తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి వెళ్లవచ్చు. అయితే ఆక్సీ మీటర్‌ కొనుగోలు చేయనివారు ఇలాంటి యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. దీన్ని అలుసుకుగా తీసుకుంటున్న కొందరు హ్యాకర్లు ఆక్సీమీటర్‌ పేరుతో డూప్లికేట్‌ యాప్స్‌ను తయారు చేసి జనాల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.

కాగా, కేంద్ర హోంశాఖ సైబర్‌ దోస్త్‌ అనే ట్విట్టర్‌ అకౌంట్‌ను నిర్వహిస్తోంది. సైబర్‌ నేరాలు జరుగకుండా దాని ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. అంతేకాకుండా ఈ-వాలెట్‌ యాప్‌ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది కేంద్రం. వాటిని యాపిల్‌ స్టోర్‌, గుగూల్‌ స్టోర్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచిస్తోంది. ఎస్‌ఎంఎస్‌, లింక్‌ రూపంలో వచ్చే యాప్‌లను నమ్మవద్దని కేంద్రం సూచిస్తోంది. అంతేకాకుండా డిస్కౌంట్‌ కూపన్లు, పెండగ, ఇతర బంపర్‌ ఆఫర్‌లు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న లింక్‌లను నమ్మవద్దని, ఎట్టి పరిస్థితుల్లో వాటిపై క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

Next Story