క్రిస్మస్ రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా సంబరాలు మొదలయ్యాయి. ఇతర ప్రాంతాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ క్రిస్మస్ సంబరాలు ప్రారంభం అయ్యాయి. వీటి మధ్య, క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఒక ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమండ్రి డిఎంసిహెచ్ స్కూల్ లో డిసెంబర్ 21న, అంటే ఈ రోజు జరుగనున్న క్రిస్మస్ సంబరాలకు ముఖ్య అతిధిగా టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఆహ్వానిస్తున్నట్టు ఈ ఆహ్వాన పత్రికలో ఉంది.

852

ఈ వార్త టివి 9 వంటి ప్రముఖ వార్తా వెబ్ సైట్లలో కూడా ప్రచురించబడింది.

https://tv9telugu.com/ttd-chairman-yv-subba-reddy-will-be-the-chief-guest-at-christmas-celebrations-in-rajahmundry-176203.html

నిజ నిర్ధారణ: రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, న్యూస్ మీటర్‌కు అలాంటిదే ఇంకో చిత్రం దొరికింది. అందులో వైవీ సుబ్బారెడ్డి పేరు లేదు. ఈ చిత్రాలను తెరచి చూస్తే, ఈ సంబారాలను నిర్వహిస్తున్న సంస్థ పేరు క్రిస్మస్ కమిటీ, వైఎస్సార్‌సీపీ రాజమహేంద్రవరం అని ఉంది. వైఎస్సార్సీపీ పేజీలు, సోషల్ మీడియా గ్రూపులలో ఎక్కడా ఈ కమిటీ లేదు. ఆహ్వానం పైభాగంలో వేసిన లోగోలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రాలు ఉన్నాయి.

సుమారు 21 మంది సభ్యుల పేర్లు ఈ ఆహ్వానంలో ఉన్నాయి, అన్ని పేర్లకి వైఎస్సార్‌సీపీ సభ్యులు అని ఉండడం విశేషం.

ప్రోటోకోల్ ప్రకారం, వైవీ సుబ్బారెడ్డి లాగా హై కేడర్‌లో ఉన్న వ్యక్తి ఏదైనా ఈవెంట్‌కి వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలోని ముఖ్యమైన వ్యక్తులు కూడా ఆహ్వానంలో ఉంటారు. కానీ, ఈ ఆహ్వానంలో రాజమండ్రి ఎమ్మెల్యే కానీ, ఇతర ముఖ్యమైన వ్యక్తులు కానీ లేరు.

శుక్రవారం రోజున, సుబ్బా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనని క్రిస్మస్ వేడుకకి అహ్వానించారనే వార్తను తోసిపుచ్చారు. తనకూ, ఆ సంస్థకు ఎటువంటి సంబంధం లేదు అని వివరించారు. తనపై జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారం పై పోలీసులకు ఫిర్యాదు చేశానని కూడా ఆయన తెలిపారు.

https://telugu.news18.com/news/politics/ttd-chairman-yv-subba-reddy-condemns-on-social-media-campaigning-against-him-ba-406118.html

టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని క్రిస్మస్ వేడుకలకి ముఖ్య అతిధిగా ఆహ్వానించారనే వార్త అబద్దం. మొత్తం ఆహ్వాన పత్రికే కల్పితం అయ్యుండొచ్చు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.