నిజాలు కావాలంటే.. ఇక్కడ తెలుసుకోండి : సీఎం జగన్
YS Jagan launches AP Fact Check website. మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో దురుద్దేశ ప్రచారాన్ని కట్టడిచేసే ఏపీ ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్
By Medi Samrat Published on 5 March 2021 12:24 PM GMT
మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో దురుద్దేశ ప్రచారాన్ని కట్టడిచేసే ఏపీ ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్, ట్విట్టర్ అకౌంట్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. వెబ్సైట్లు, సోషల్ మీడియాలు వేదికగా కొంతమంది దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో... ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికలుగా ప్రభుత్వం ఖండిస్తుందని పేర్కొన్నారు. నడుస్తున్న ప్రచారం ఎలా తప్పో సాక్ష్యాధారాలతో చూపిస్తారని వెల్లడించారు. నిజమేంటో, అబద్ధం ఏంటో చూపించడమే..ఏపీ ఫ్యాక్ట్‌చెక్ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. దురుద్దేశపూర్వక ప్రచారంమీద చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాంటి ప్రచారం మొదట ఎక్కడనుంచి మొదలైందో దాన్ని గుర్తించి.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఒక వ్యక్తి, వ్యవస్థ ప్రతిష్ఠను, ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదని సీఎం అన్నారు. వ్యక్తిగత ఉద్దేశాలతో వ్యవస్థలను భ్రష్టుపట్టించే హక్కు ఎవ్వరికీ లేదని ఉద్ఘాటించారు. వ్యవస్థలను తప్పుదోవపట్టించే పనులు ఎవరూ చేయకూడదని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలపైన వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొందరు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వేరే కారణాలతో ఇలాంటి దురుద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటికి ఎక్కడోచోట ముగింపు పలకాలని హితవు పలికారు.
ఓటర్ స్లిప్పుల పంపకం, ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయడం లాంటివి చేయకుండా ఉండేందుకు, వారి ఫోన్లను సైతం స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలలో పేర్కొన్నారు. కాగా, ఏపీలో పురపాలక ఎన్నికలలో గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలు నిషేధిస్తూ విధించిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు నిలిపివేసింది. పంచాయతీ ఎన్నికల్లో సైతం గ్రామ వాలంటీర్లపై చాలా ఫిర్యాదు వచ్చాయని, వారిని మున్సిపల్ ఎన్నికల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని భావించిన ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ వాలంటీర్ల సేవలు అందించకూడదని ఆంక్షలు విదించారు.