2023 కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే..! అయితే భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని అభినందిస్తున్నట్లు ఓ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది.
ట్విట్టర్ యూజర్లు #KarnatakaElectionResults అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ లో కాంగ్రెస్ ను అభినందిస్తూ పోస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. స్క్రీన్‌షాట్‌లో రాహుల్ గాంధీ చిత్రం కూడా ఉంది.
పలువురు ట్విట్టర్ యూజర్లు విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి సంబంధించిన ఇలాంటి స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తూ వస్తున్నారు. “విరాట్ కోహ్లీ తాజా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ, అభినందనలు కాంగ్రెస్” అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. 'ఈ సలా గవర్నమెంట్ నమదే' అంటూ కోహ్లీ స్టోరీ పెట్టాడని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
ఈ వైరల్ పోస్టులు మార్ఫింగ్ చేసినవని న్యూస్ మీటర్ బృందం గుర్తించింది.
మేము విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పేజీని తనిఖీ చేసాము. అతని ఖాతాలో అలాంటి స్టోరీ ఏదీ కనుగొనలేదు.
ఇటీవల విరాట్ కోహ్లీ తన స్టోరీలో పలువురు క్రికెటర్లను అభినందిస్తూ పోస్టులు పెడుతూ ఉన్నాడు. మే 12న పోస్ట్ చేసిన కథనంలో, తన తొలి IPL సెంచరీని కొట్టినందుకు సూర్యకుమార్ యాదవ్‌ను అభినందించాడు. మరో స్టోరీలో One8 బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ కనిపించాడు.
ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ ఏ పొలిటికల్ పార్టీని కూడా ప్రమోట్ చేస్తూ కనిపించలేదు.
కోహ్లి సూర్యకుమార్ యాదవ్‌ను అభినందించిన స్టోరీ స్క్రీన్‌షాట్‌పై రాహుల్ గాంధీ చిత్రాన్ని సూపర్మోస్ చేయడం ద్వారా వైరల్ స్క్రీన్‌షాట్ మార్ఫింగ్ చేశారని కూడా మేము గమనించాము.
మార్ఫింగ్-ఒరిజినల్ మధ్య ఉన్న తేడాలను మీరు గమనించవచ్చు.
చివరగా, మేము కీవర్డ్ సెర్చ్ చేసాము కానీ విరాట్ కోహ్లీ రాహుల్ గాంధీని అభినందించాడంటూ విశ్వసనీయ మీడియా సంస్థల నుండి ఎటువంటి నివేదిక కనుగొనలేకపోయాము.
స్క్రీన్‌షాట్స్ మార్ఫింగ్ చేశారని గుర్తించాం. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam