బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వారి మధ్య పిల్లలతో ప్రయాణిస్తున్న ఫోటోకు ఓ వాయిస్ ఓవర్ కలిగి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇటీవలి కాలంలో పిల్లల కిడ్నాప్‌ను చూపుతుందనే వాదనతో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వీడియోలోని వాయిస్ ఓవర్ లో పిల్లల తండ్రి అని ఓ వ్యక్తి చెప్పుకోవడం మనం వినవచ్చు. అతను చిత్రంలో ఉన్న వ్యక్తులు కిడ్నాప్ చేశారని.. తన బిడ్డకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే తెలియజేయాలని కోరారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ వీడియో 2022 నాటిదని.. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని నిర్ధారించింది.
పిల్లల తండ్రికి చెందినదిగా భావిస్తున్న వీడియోలోని ఫోన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా మేము మా దర్యాప్తును ప్రారంభించాము. నంబర్ చెల్లనిదని, స్పామ్‌గా కూడా గుర్తించాము.
కీవర్డ్ సెర్చ్ చేయగా.. సెప్టెంబర్ 23, 2022న ‘Rumours of child kidnapping spook parents, keep police on their toes’ అనే శీర్షికతో హిందూస్థాన్ టైమ్స్‌లో మీడియా నివేదికను మేము కనుగొన్నాము.
నివేదిక ప్రకారం, ముంబై చుట్టూ పిల్లల కిడ్నాప్‌కు సంబంధించి అనేక నకిలీ వాట్సాప్ నోట్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లు 2022లో విస్తృతంగా షేర్ చేశారు. అటువంటి ధృవీకరించబడని ఆడియో సందేశాలు, సోషల్ మీడియా పోస్ట్‌లు ప్రజల మధ్య గందరగోళాన్ని సృష్టించాయి. అంతేకాకుండా ప్రజల్లో అనవసర భయాన్ని వ్యాప్తి చేశాయి.
ముంబై పోలీసులు ఈ వైరల్ పోస్టులపై ప్రజలకు కీలక సూచనలు చేశారు. వైరల్ పోస్టులను షేర్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రతి సందేశాన్ని ధృవీకరించుకోవాలని అన్నారు. కంజుర్‌మార్గ్‌లోని హెచ్‌డిఐఎల్ ప్రీమియర్ కోహినూర్ సొసైటీ నుండి పిల్లవాడిని కిడ్నాప్ చేసినట్లుగా ప్రచారంలో ఉన్న రెండు ఆడియో క్లిప్‌లు, విఖ్రోలిలోని మునిసిపల్ పాఠశాల నుండి విద్యార్థిని తీసుకెళ్లడం గురించి మరొకటి నకిలీవని పోలీసులు కనుగొన్నారు.
అంధేరీ నుండి 11 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన మరో కేసు కూడా నకిలీదని, నిరాధారమని తేలింది. పోలీసులు విచారణలో సీసీటీవీ ఫుటేజీ కానీ.. ఈ కిడ్నాప్ లకు సాక్షులు కానీ దొరకలేదని తెలిపారు.
మిడ్-డే, సిటిజన్ మ్యాటర్స్ వంటి మీడియా సంస్థలు కూడా వైరల్ ఇమేజ్‌ని ఉపయోగించి ముంబైలో పిల్లల కిడ్నాప్ కేసుల గురించి సోషల్ మీడియాలో పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని నివేదించాయి.
మేము చిత్రంమూలాన్ని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినా లేదా కిడ్నాప్ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను కనుగొనలేకపోయినప్పటికీ, మా పరిశోధనల ద్వారా.. వైరల్ వీడియో పాతదని.. ఇటీవలి పిల్లల కిడ్నాప్ లకు సంబంధించినది కాదని స్పష్టం చేశాం.
Credits : Sunanda Naik