Fact Check : రైతుల ఆందోళనలకు మద్దతుగా రాజ్ నాథ్ సింగ్ బహిరంగ సభలో వ్యాఖ్యలు చేశారా..?

Viral video of Rajnath Singh. యూనియన్ మిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్

By Medi Samrat
Published on : 11 Dec 2020 9:53 AM IST

Fact Check : రైతుల ఆందోళనలకు మద్దతుగా రాజ్ నాథ్ సింగ్ బహిరంగ సభలో వ్యాఖ్యలు చేశారా..?

యూనియన్ మిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతుగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారంటూ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు. వైరల్ అవుతున్న వీడియోలో రాజ్ నాథ్ సింగ్ రైతులకు మద్దతుగా మాట్లాడారు. ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా రాజకీయ లబ్దిని ఆశించకుండా రైతులకు మద్దతు ఇవ్వాలని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేశారు రాజ్ నాథ్ సింగ్.



రాజ్ నాథ్ సింగ్ తమ సొంత పార్టీకి వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు చేశారంటూ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు. భారత్ బంద్ కు రాజ్ నాథ్ సింగ్ కూడా మద్దతు పలికారని పోస్టులు పెడుతూ వస్తున్నారు. రాజ్ నాథ్ సింగ్ రైతుల ఆందోళనలకు మద్దతు పలికారంటూ ఈ వీడియోను అప్లోడ్ చేసి పోస్టులు పెడుతున్నారు.





నిజ నిర్ధారణ:

రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటివి కావు.. 2013 సంవత్సరంలో జంతర్ మంతర్ వద్ద రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఆందోళనలకు ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదు.

వైరల్ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని వెతకగా ఎటువంటి రిజల్ట్స్ లభించలేదు. న్యూస్ మీటర్ కీవర్డ్ సెర్చ్ నిర్వహించింది. 'Farmer's dharna', 'Rajnath Singh' అనే కీవర్డ్స్ ను ఉపయోగించగా ఓ వీడియో దొరికింది. మార్చి 20, 2013న ఈ వీడియోను భారతీయ జనతా పార్టీ అధికారిక యుట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. `Shri Rajnath Singh addressing farmers staging a dharna at Jantar Mantar, New Delhi: 20.03.2013.' అంటూ వీడియోకు టైటిల్ ను పెట్టారు. 20.03.2013 న న్యూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద రైతుల ధర్నాలో రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అని పూర్తీ సమాచారం అందులో ఉంది.


వైరల్ అవుతున్న క్లిప్ ను 1:10 నిమిషాల వద్ద మొదలవుతుంది.

రాజ్ నాథ్ సింగ్ అధికారిక వెబ్సైట్ లో కూడా ఈ వీడియోను చూడొచ్చు. మార్చి 19, 2013న Hindu లో రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలకు సంబంధించిన కథనాలను చూడొచ్చు. రైతులకు కనీసం ఆదాయం సంపాదించుకోడానికి ప్రభుత్వం సరైన సదుపాయాలను ఇవ్వడం లేదని రాజ్ నాథ్ సింగ్ అప్పట్లో చెప్పుకొచ్చారు. బీజేపీ అప్పట్లో ప్రతి పక్షంలో ఉంది. అప్పటి వీడియోను కట్ చేసి.. కొద్దిగా నిడివి ఉన్నదాన్ని మాత్రమే వైరల్ చేశారు.

రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటివి కావు.. 2013 సంవత్సరంలో జంతర్ మంతర్ వద్ద రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న రైతు ఆందోళనలకు ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.




Next Story