నిజమెంత: రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా 'ఇండియా.. ఇండియా' అంటూ నినాదాలు చేశారా?
రిపబ్లికన్‌లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను అధికారికంగా ఎన్నుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు
నిజమెంత: రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా 'ఇండియా.. ఇండియా' అంటూ నినాదాలు చేశారా?
రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా.. రిపబ్లికన్‌లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను అధికారికంగా ఎన్నుకున్నారు. ఇక ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జెడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తి అంటూ రిపబ్లికన్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
భారతీయ మూలాలు ఉన్న అతని భార్య ఉషా తో కలిసి జెడీ వాన్స్ ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరిని పలువురు ప్రతినిధులు అభినందించారు. ఈ నేపథ్యంలో.. అక్కడున్న వారు 'ఇండియా-ఇండియా' అనే నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
“'India India' chants as JD Vance brings soon-to-be second lady Usha Chilukuri into the RNC convention.” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ క్లిప్ ను ఎడిట్ చేశారని గుర్తించింది.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని గుర్తించింది. ‘ఇండియా-ఇండియా’ నినాదాలు డిజిటల్‌గా వీడియోలో ఎడిట్ చేశారు.
మేము YouTubeలో కీవర్డ్ సెర్చ్ చేసాము. జూలై 16న ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన వీడియోలో వైరల్ క్లిప్ లాంటి విజువల్స్ తో “చూడండి: J.D. వాన్స్ RNCలో వైస్ ప్రెసిడెంట్ నామినీగా నామినేట్ చేశారు.” అనే అర్థం వచ్చేలా “Watch: J.D. Vance Is Nominated as Vice Presidential Nominee at the RNC.” టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.
వైస్ ప్రెసిడెన్షియల్ నామినీగా వాన్స్‌ని ప్రకటించడం, ఆ తర్వాత ఆయన, ఆయన భార్య ఉష సమావేశానికి హాజరైన వారిని పలకరించడం వీడియోలో చూడొచ్చు. వైరల్ క్లెయిమ్‌లలో చెప్పినట్లు మేము ఈ వీడియో వెర్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అనే నినాదాలు వినలేదు. బదులుగా, వాన్స్ నామినేషన్ ప్రకటించినప్పుడు కంట్రీ బ్యాండ్ సిక్స్‌వైర్ ప్రదర్శన ఇచ్చింది.
మేము జూలై 15న ఫోర్బ్స్ YouTube ఛానెల్‌లో ఈ మీటింగ్ ను ప్రత్యక్ష ప్రసారం చేసిన వీడియోను కూడా కనుగొన్నాము. ఈ వీడియోలో వైరల్ క్లిప్ మూడు గంటల టైమ్‌స్టాంప్‌లో కనిపిస్తుంది. అక్కడ కూడా సిక్స్‌వైర్ మ్యూజిక్ ప్లే అవుతుంది.
కాబట్టి, రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా 'ఇండియా-ఇండియా' నినాదాలు చేశారనే వాదనలో ఎలాంటి నిజం లేదు. వాన్స్‌కు శుభాకాంక్షలు తెలిపే వైరల్ క్లిప్ ఎడిట్ చేశారని మేము నిర్ధారించాము.