నిజమెంత: అనంత్ అంబానీ పెళ్లిలో జావేద్ అక్తర్, షబానా అజ్మీ డ్యాన్స్ చేశారా?

జావేద్ అక్తర్, షబానా అజ్మీ, ఊర్మిళ, జావేద్ జాఫ్రీతో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Sept 2024 5:43 PM IST
నిజమెంత: అనంత్ అంబానీ పెళ్లిలో జావేద్ అక్తర్, షబానా అజ్మీ డ్యాన్స్ చేశారా?

జావేద్ అక్తర్, షబానా అజ్మీ, ఊర్మిళ, జావేద్ జాఫ్రీతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంగీతానికి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది జులైలో అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ వివాహ వేడుకలో భాగంగా ఈ వీడియోను రికార్డు చేశారని వైరల్ అవుతున్న వాదన చెబుతోంది.

సెలబ్రిటీల మతపరమైన అంశాలపై స్పందిస్తూ..ఒక X వినియోగదారు ఈ వీడియోను పంచుకున్నారు. “ఇది ముఖేష్ అంబానీ కొడుకు వివాహానికి సంబంధించిన వీడియో. పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం ఇస్లాంలో నిషిద్ధం అయినా.. ముఖేష్ అంబానీ నుంచి గిఫ్ట్ వస్తుందనే ఆశతో వీరందరూ ఆంటిలియా(ముకేశ్ అంబానీ నివాసం) ముందు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో చూడండి. ఇందులో శివసేన లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలు ఊర్మిళా ఆసిఫ్ కూడా ఉన్నారు. ఇండియాలో తమకు భయంగా ఉందని చెబుతూ ఉంటారని, అయితే యాంటిలియా ముందు డ్యాన్స్ చేయడానికి మాత్రం భయపడబోమని వారందరూ అంటున్నారు. వీరిని ఆఫ్ఘనిస్తాన్‌కు పంపండి, అప్పుడు మీకు ఆర్‌ఎస్‌ఎస్, తాలిబాన్‌ల మధ్య తేడా తెలుస్తుంది. (ఆర్కైవ్) అంటూ పోస్టు పెట్టారు.

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న క్లెయిమ్ లో ఎలాంటి నిజం లేదని కనుగొంది. అంబానీ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేని వివాహ వేడుకలో సెలబ్రిటీలు డ్యాన్స్ చేస్తున్నారని గుర్తించాము.

కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించగా.. డిసెంబర్ 8, 2018న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్టిస్ట్, రేడియో ప్రెజెంటర్ సయేమా పోస్ట్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. క్యాప్షన్‌లో ఆమె ఓ ఈవెంట్‌కు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. కానీ ఏ ఈవెంట్ గురించి అనే నిర్దిష్ట వివరాలను అందించలేదు. “జావేద్ అక్తర్, జావేద్ జాఫరీ, ఊర్మిళా మటోండ్కర్, షబానా అజ్మీ బిందాస్ డ్యాన్స్” అని సయేమా రాశారు.

మా పరిశోధనలో, ఈ వీడియో 2018లో వైరల్‌గా మారిందని మేము కనుగొన్నాము. అంబానీ కుమార్తె ఇషా అంబానీ ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌లో ప్రముఖులు డ్యాన్స్ చేసినట్లు అనేక మీడియా సంస్థలు తెలిపాయి.

అయితే, డిసెంబర్ 11, 2018 న జావేద్ అక్తర్ భార్య, షబానా అజ్మీ, X లో ఒక పోస్ట్‌లో ఈ వీడియో అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు. షహనా దాస్‌గుప్తా, చిన్మయ జైల్‌వాలా వివాహ వేడుకలో ఖండాలాలోని సుకూన్‌లో చిత్రీకరించిన వీడియో అని తెలిపారు.

అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా జావేద్ అక్తర్, ఇతర బాలీవుడ్ ప్రముఖులు డ్యాన్స్ చేయడం ఈ వీడియోలో లేదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim Review:నిజమెంత: అనంత్ అంబానీ పెళ్లిలో జావేద్ అక్తర్, షబానా అజ్మీ డ్యాన్స్ చేశారా?
Claimed By:X users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X Users
Claim Fact Check:False
Next Story