కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ ఇటీవలే పుట్టినరోజును జరుపుకున్నారు. ఆమెకు పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఆమె యుక్తవయసుకు సంబంధించిన ఫోటోలు అంటూ కొందరు పోస్టులు పెడుతూ ఉన్నారు. సోనియా గాంధీ యుక్తవయసులో ఉన్న సమయంలో బార్ వెయిట్రెస్ అంటూ కూడా కామెంట్లు పెట్టారు. 1970 లో సోనియా గాంధీ పొట్టి డ్రెస్ లు వేసుకుంది అంటూ ఫోటోలను పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ:
ఆ వైరల్ ఫోటో ల్లో ఉన్నది సోనియా గాంధీ కాదు. స్విస్ నటి ఉర్సులా ఆండ్రెస్, అమెరికన్ యాక్ట్రెస్ మార్లిన్ మన్రో..! వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోనియా గాంధీ ముఖాన్ని అతికించారు.
న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వైరల్ అవుతున్న ఫొటోల్లో ఉన్నది స్విస్ నటి ఉర్సులా ఆండ్రెస్, ఆమెతో పాటూ ఉన్నది జేమ్స్ బాండ్ సినిమా హీరో సీన్ కానరీ.
మరో సెట్ కు సంబంధించిన ఫోటోలపై కూడా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. పలు వెబ్సైట్లలో ఉర్సులా ఆండ్రెస్, మార్లిన్ మన్రోకు సంబంధించిన ఫోటోలని స్పష్టంగా తెలుస్తోంది.
కాంగ్రెస్ ఛీఫ్ సోనియా గాంధీకి చెందిన ఫోటోలు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఆమె బార్ వెయిట్రెస్ గా కూడా పనిచేయలేదు. పోస్టులన్నీ 'పచ్చి అబద్ధం'.