Fact Check : కరోనా వ్యాక్సిన్ వేయడానికి బ్యాంకు డీటైల్స్ అడుగుతూ ఉన్నారా..?
Viral NHS message seeking bank details for Covid vaccine is fake. కేమ్ బ్రిడ్జ్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన మెసేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ వున్నా కరోనా వ్యాక్సిన్ వేయడానికి బ్యాంకు డీటైల్స్.
By Medi Samrat Published on 7 Jan 2021 2:50 AM GMT
కేమ్ బ్రిడ్జ్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన ఎన్.హెచ్.ఎస్. ఫౌండేషన్ ట్రస్ట్ కు సంబంధించిన మెసేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.
"NHS: We have identified that you are eligible to apply for your vaccine. For more information and to apply, follow here: uk-application-form.com (sic)," అంటూ ఓ మెసేజీ పలువురికి వస్తోంది. మీరు కరోనా వ్యాక్సిన్ వేయించుకోడానికి అన్ని అర్హతలు సాధించారు. కింది లింక్ ను క్లిక్ చేయండి అన్నది ఆ మెసేజీ సారాంశం. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే బ్యాంకు సమాచారం, కార్డు డీటైల్స్ ను అడుగుతోంది.
ఆ లింక్ మీద క్లిక్ చేయగానే
"We need to prove ownership of the address.
Please get a debit/credit card ready, you will need:
Sort code
Account number
Long card Number
We will use this to verify the billing address with the bank. No payments are made during verification."
అంటూ విలువైన సమాచారాన్ని కోరడాన్ని గమనించవచ్చు.
నిజ నిర్ధారణ:
కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం కోసం బ్యాంకు డీటైల్స్, కార్డులకు సంబంధించిన సమాచారం కోరడం లేదు. ఇది ప్రజల దగ్గర నుండి డబ్బులు కాజేయడం కోసం చేసిన పన్నాగం మాత్రమే..! ఎన్.హెచ్.ఎస్. పేరుతో వచ్చిన ఈ మెసేజీని నమ్మకండి. వైరల్ అవుతున్న మెసేజీలో ఎటువంటి నిజం లేదు.
ఎన్.హెచ్.ఎస్. కూడా ఈ వైరల్ మెసేజీని నమ్మకండంటూ హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు కూడా దీనిపై హెచ్చరించారు. మొదటి ఫేస్ లో కరోనా వ్యాక్సిన్ ను వేయించుకున్న వాళ్ళను టార్గెట్ చేసి ఈ మెసేజీలను పంపారని అధికారులు చెబుతూ ఉన్నారు.
ఎన్.హెచ్.ఎస్. కూడా ఈ వైరల్ మెసేజీల మీద స్పందించింది. తాము ఇలాంటి మెసేజీలను పంపడం లేదని తెలిపింది. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అన్నది పూర్తీ ఉచితంగా జరుగుతోందని.. ఇలాంటి మెసేజీలు వచ్చిన వెంటనే వాటిని డిలీట్ చేయమని కోరింది. బ్యాంకులను సంప్రదించి, క్రెడిట్ కార్డు-డెబిట్ కార్డుల పాస్ వర్డ్స్ ను మార్చుకోవాలని సూచించారు.
NHS Leeds లో కూడా ఇందుకు సంబంధించిన ఆర్టికల్ ను పబ్లిష్ చేయడం జరిగింది. ఎన్.హెచ్.ఎస్. ఎప్పుడు కూడా ఇలాంటి సమాచారాన్ని అడగదని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్సనల్ సమాచారాన్ని వారికి ఇవ్వకూడదని తెలిపింది.
London, UK Crime అధికారిక ట్విట్టర్ ఖాతాలలో ఈ మెసేజీకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను పోస్టు చేసి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మెసేజీ వలలో పడకండని సూచించారు. "Fake - asks for bank account details, credit card number and a whole load of personal info. The website looks very real but clearly a scam." తప్పుడు మెసేజీ అని, ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండని కోరారు.
Fake - asks for bank account details, credit card number and a whole load of personal info. Website looks very real but clearly a scam pic.twitter.com/u9H2pinjP3
— London & UK Crime (@CrimeLdn) December 28, 2020
ఈ టెక్స్ట్ మెసేజీ పక్కాగా స్కామ్ లా అనిపిస్తూ ఉంది. ఎన్.హెచ్.ఎస్. కార్డులకు సంబంధించి ఎటువంటి డీటైల్స్ ను కూడా అడగదు. ఇందుకు సంబంధించిన మాయలో పడకండి. కోవిద్-19 వ్యాక్సిన్ విషయంలో ఎటువంటి బ్యాంకు డీటైల్స్ అడగరు. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.