పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరియు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టేబుల్ వద్ద కూర్చుని భోజనం చేస్తున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
'గతంలో ప్రధాని నరేంద్ర మోదీ బిరియానీ తినడానికి పాకిస్తాన్ కు వెళ్లారు. ఆ తర్వాత పుల్వామా దాడులు జరిగాయి. ప్రతిదీ భారతీయ జనతా పార్టీ తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఉంది' అంటూ పలువురు పోస్టులు పెడుతూ వచ్చారు. నరేంద్ర మోదీకి, ఇమ్రాన్ ఖాన్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ పలువురు ఆరోపిస్తూ.. ఈ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ వచ్చారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. ఇదొక గాలివార్త.
వైరల్ అవుతున్న ఫోటోను న్యూస్ మీటర్ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. జులై 5, 2015కు సంబంధించిన ఫోటోల రిజల్ట్స్ వచ్చాయి.
ఆరు సంవత్సరాల కిందట డైలీ మోషన్ సైట్ లో ఓ వీడియోను కనిపించింది. 'Imran Khan, Reham devour sehri at Faisal Vawda's residence' అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.
మోదీ ఫోటోను కూడా గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా డిసెంబర్ 16, 2013న The New Indian Express అప్లోడ్ చేసి ఉంది. వైరల్ ఇమేజ్ ఒరిజినల్ ఇమేజ్ ను చూడొచ్చు. కొందరు కావాలనే మార్ఫింగ్ చేసి.. మోదీతో కలిసి ఇమ్రాన్ ఖాన్ భోజనం చేస్తున్నట్లుగా పోస్టులను పెట్టారు. కాబట్టి వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
వైరల్ అవుతున్న ఫోటోలు మార్ఫింగ్ చేయబడినవి.