FactCheck : సోనియా గాంధీని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నిఖా చేసుకున్నారా?

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, ఆయన భార్య సోనియా గాంధీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Sept 2023 9:15 PM IST
FactCheck : సోనియా గాంధీని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నిఖా చేసుకున్నారా?

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, ఆయన భార్య సోనియా గాంధీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ అరుదైన ఫోటో గురించి చర్చ జరుగుతూ ఉంది.

ఇద్దరూ ఇస్లామిక్ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నారని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు. ఇద్దరూ నిఖా చేసుకున్నారని ప్రచారం చేస్తున్నారు.

వైరల్ చిత్రంలో, ఈ జంటను సంప్రదాయ ఇస్లామిక్ వస్త్రధారణలో మనం చూడవచ్చు. ఈ చిత్రం సోనియా గాంధీ, రాజీవ్ గాంధీల నిఖా వేడుకకు సంబంధించినదని నెటిజన్లు చెబుతున్నారు.

గతంలో కూడా వీరిద్దరి వివాహం గురించి కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. గాంధీ కుటుంబం క్రిస్టియన్-పార్సీ కాదని.. రాజీవ్, సోనియా ఇస్లాం మతంలోకి మారారంటూ కూడా పోస్టులు వైరల్ అయ్యాయి.

మరొక పోస్ట్‌లో, క్రిస్టియన్ ఆచారాల ప్రకారం ఇద్దరూ చర్చిలో పెళ్లి చేసుకున్నారు అంటూ కూడా పోస్టులు వైరల్ అయ్యాయి.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.

సంబంధిత కీవర్డ్ సెర్చ్ చేయగా.. 1968 నాటి సోనియా గాంధీ, రాజీవ్ గాంధీల వివాహానికి సంబంధించిన మొత్తం ఫుటేజీని పంచుకున్న ట్విట్టర్ వినియోగదారు చేసిన ట్వీట్‌ ని చూశాం. అందులో హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి జరిగినట్లు ఆ వీడియో చూపిస్తుంది. రాజీవ్-సోనియా గాంధీల వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిందని ఆ వీడియో స్పష్టం చేసింది.

'బ్రిటీష్ మూవీటోన్' పేరుతో అసోసియేట్ ప్రెస్ యూట్యూబ్ ఛానెల్ లోగోతో పాటు అదే వీడియోను మేము కనుగొన్నాము. వీడియో 21 జస్ట్ 2015న అప్‌లోడ్ చేశారు.

వీడియో వివరణలో 'శ్రీమతి. ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ మిస్ సోనియా మైనో (ఇటాలియన్)ని వివాహం చేసుకున్నారు.' అని ఉంది. (‘Mrs. Indira Gandhi's son Rajiv marries Miss Sonia Maino (Italian). Various shots of the wedding ceremony - Mrs. Indria Gandhi and Mrs. Vijay Lakshmi Pandit - Ceremony and cutting the cake - Shots of the happy couple with Indian President Dr. Zakir Hussain.’)


నిజమెంత: సోనియా గాంధీని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నిఖా చేసుకున్నారా?

న్యూస్‌మీటర్ వైరల్ ఇమేజ్ రాజీవ్ గాంధీ పెళ్లి తర్వాత జరిగిన ఫ్యాన్సీ-డ్రెస్ పార్టీకి చెందినదని గుర్తించింది.

ప్రభుత్వ వెబ్‌సైట్ భారతీయ సంస్కృతి ప్రకారం, వైరల్ ఫోటోను గుర్తించాం. న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1968 తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ పార్టీలో సోనియా గాంధీతో పాటూ ఇతరులను కూడచూడొచ్చు . సంజయ్ గాంధీ, మొహమ్మద్ యూనుస్ కూడా ఆ ఫోటోలో ఉన్నారు.


మా రీసర్చ్ ప్రకారం.. ఇస్లామిక్ లేదా క్రిస్టియన్ సంప్రదాయాలలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల వివాహం జరగలేదు. వారిరువురి వివాహం హిందూ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం జరిగిందని మేము కనుగొన్నాము. పెళ్లి తర్వాత పార్టీలో తీసిన ఫొటో వైరల్‌గా మారింది.

Credits : Sunanda Naik

Claim Review:సోనియా గాంధీని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నిఖా చేసుకున్నారా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:False
Next Story