ఓ వ్యక్తి తలలోకి తూటా వెళ్లలేకపోయిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. పాలస్తీనాకు చెందిన వ్యక్తి అతడని.. అతడు మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటే ఓ తూటా దూసుకొచ్చిందని తెలిపారు. అయినా కూడా అతడి తలను ఆ తూటా ఛిద్రం చేయలేకపోయిందని పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఎంతో మంది ఇదొక అద్భుతం అంటూ చెప్పుకొచ్చారు.


నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఈ కథనాలు నిజం కాదు. ఈ ఒరిజినల్ ఫోటోను 2014 సంవత్సరం ఇరాక్ లో తీశారు.

ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు షేక్ మొహమ్మద్ ఒబైద్ అల్-రావి.. ఈయన ఇరాక్ దేశానికి చెందిన వారు. 2014 లో ఇరాక్ దేశంలోని అల్-ఫళ్ళుజా నగరంలో సాయంత్రం ప్రార్థనలకు హాజరవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బులెట్ ఆయన తలకు ఎటువంటి గాయం చేయలేకపోయింది. పాలస్తీనాలో ఇటీవలి కాలంలో ఈ ఘటన చోటు చేసుకోలేదు. ఇరాక్ లో చోటు చేసుకున్న ఘటన ఇది.

ఈ వైరల్ ఫోటోపై న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఫోటో 2014 లో చోటు చేసుకుందని స్పష్టంగా అర్థమైంది. రిపోర్టుల ఆధారంగా అప్పట్లో ఇరాక్ ప్రభుత్వానికి.. అక్కడి ట్రైబల్స్ కు మధ్య చోటు చేసుకున్న కాల్పుల్లో ఆయనపైకి బులెట్ వచ్చినా తల లోకి వెళ్లలేకపోయింది. ఫోటోలో ఉన్న విధంగా నిలిచిపోయింది.

మిడిల్ ఈస్ట్ కు చెందిన న్యూస్ ఏజెన్సీలు కూడా ఇదే విషయాన్ని తెలియజేశాయి.

వైరల్ అవుతున్న ఫోటో ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాల మధ్య చోటు చేసుకున్న యుద్ధవాతావరణానికి చెందినది కాదు. 2014 లో ఇరాక్ లో చోటు చేసుకున్న ఘటన. కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
Claim Review :   ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన బుల్లెట్లు పాలస్తీనా వ్యక్తి తలలోకి దూసుకు వెళ్లలేకపోయాయి..!
Claimed By :  Social Media Users
Fact Check :  False

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story