2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పలు సంస్థలు అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నాయి. అయితే కొన్ని సంస్థలు సర్వేలు చేయకున్నా కూడా ఆయా సంస్థల పేరిట కొన్ని పోస్టర్లు వైరల్ అవుతూ ఉన్నాయి.
ABP వార్తా సంస్థ చేసిన అభిప్రాయ సేకరణ అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. వైరల్ అయిన CVoter సర్వే పోస్టర్ ఫిబ్రవరి 29 నాటిది. ABP లైవ్ లోగోను కలిగి ఉంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ)కి 142 సీట్లు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీ (జేఎస్పీ)లకు కలిపి 33 సీట్లు వస్తాయని అందులో అంచనా ఉంది.
YSRCP యూత్ అనే X ప్రీమియం హ్యాండిల్ “#YSJagan #YSJaganAgainIn2024” అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి పోస్టర్‌ను షేర్ చేశారు.
ఇంకొన్ని పోస్టర్లలో ఇదే సంస్థ పేరు మీద సర్వే ఫలితాలు వచ్చాయి. అందులో టీడీపీ కూటమికి ఎక్కువ సీట్లు వస్తున్నట్లు ఉంది.
నిజ నిర్ధారణ :
వైరల్ పోస్టర్ లో ఎటువంటి నిజం లేదని న్యూస్ మీటర్ కనుగొంది.
మేము Xలో కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. ఫిబ్రవరి 29న ABP లైవ్ సోషల్ మీడియా అకౌంట్స్ లో 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వైరల్ సర్వే 'ఫేక్' అని పేర్కొంటూ ఒక పోస్ట్‌ను చూసాము.
ఫిబ్రవరి 29 నాటి ABP న్యూస్ నుండి “ఫేక్ న్యూస్ హెచ్చరిక: ‘ABP-CVoter సర్వే’ AP ఎన్నికల 2024పై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది” అనే నివేదికను కూడా మేము చూశాము.
వాట్సాప్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రచారం అవుతున్న పోస్టర్ పూర్తిగా కల్పితమని సదరు సంస్థ తెలిపింది. వైరల్ పోస్ట్‌లో చేసిన క్లెయిమ్‌లకు సంబంధించి ఎలాంటి డేటాను జారీ చేయలేదని సదరు సంస్థలు తెలిపాయి.
అందువల్ల, రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCPకి 142 సీట్లు వస్తాయని వైరల్ ఒపీనియన్ పోల్ ABP గ్రూప్ ప్రచురించినది కాదని.. కల్పితమని మేము నిర్ధారించాము.
Credit : Md Mahfooz Ali