Fact Check : వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న ఈ సైకిల్ ను భారత్ లో బ్రిటీష్ పాలనలో పోలీసులు ఉపయోగించారా..?

Vintage Bicycle In Viral Photo. ఒక వింటేజ్ సైకిల్ కు సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.

By Medi Samrat  Published on  5 March 2021 6:48 AM GMT
Vintage Bicycle In Viral Photo.

ఒక వింటేజ్ సైకిల్ కు సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఆ పురాతనమైన సైకిల్ కు రైఫిల్ ను కూడా ఉండడాన్ని గమనించవచ్చు. భారత్ లోని పోలీసు స్టేషన్ లో బ్రిటీష్ కాలంలో ఈ సైకిల్ ను ఉంచేవారంటూ హిందీలో పోస్టులు పెడుతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఈ ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి.

భారత్ కు స్వాతంత్య్రం రాకముందు బ్రిటీషర్లు పోలీసు స్టేషన్ లో వీటిని ఉంచేవారని చెప్పుకొచ్చారు.



నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఈ ఫోటోను సెర్చ్ చేయగా.. ఇది జర్మన్ కు చెందినదని తెలిపారు. దీన్ని భారత్ లో అసలు ఊహించలేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్లు ఈ వాహనాన్ని వాడారు.

ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. అచ్చం ఇలాంటి ఫోటోనే రెడ్డిట్, పింటరెస్ట్ లో చూడొచ్చు. ఇవి జర్మన్ బైసైకిల్స్ వీటికి స్ప్రింగ్ వీల్స్ ఉంటాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో దీన్ని ఉపయోగించారు.

ఈ సమాచారాన్ని బట్టి కీవర్డ్స్ ను వాడగా.. onlinebicyclemuseum.co.uk అనే వెబ్ సైట్లో సైకిళ్ళకు సంబంధించిన సమాచారాన్ని ఉంచారు. వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న సైకిల్ ను జర్మన్ స్ప్రింగ్ వీల్ బైసైకిల్ గా చెప్పుకొచ్చారు.

ఈ వెబ్సైట్ లో ప్రపంచ దేశాల్లో వినియోగించిన సైకిళ్ళకు సంబంధించిన సమాచారం ఉంది. పలువురు నిపుణులు, చరిత్రకారులు కూడా సైకిళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఆన్ లైన్ సైకిల్ మ్యూజియంలో ఉంచారు. కొలిన్ కిర్షే ఈ ఆన్ లైన్ మ్యూజియం సృష్టికర్త ఈ సైకిల్ కు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు. వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది 1905 నాటి హెరెనార్డ్ విక్టోరియా మోడల్ 12 జర్మన్ సైకిల్.. ఈ సైకిల్ కు ఉన్నది 'మాసర్ జిఈడబ్ల్యూ 88 రైఫిల్'.. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ రైఫిల్ ను ఉపయోగించారు.

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో రబ్బర్ కు కొరత ఏర్పడిందని అందుకోసమే ఈ సైకిల్ కు స్ప్రింగ్స్ ను వినియోగించారని.. అది కూడా చాలా అరుదుగా ఉంటాయని కొలిన్ చెప్పుకొచ్చారు. కొలిన్ కు ఫేస్ బుక్ పేజీ కూడా ఉంది.. అక్కడ అరుదైన సైకిళ్ళను కొనుక్కోవచ్చు కూడానూ..!

https://www.facebook.com/RideVintageTVchannel/

ఫోటోలో ఉన్న ఈ సైకిల్ ను భారత్ లో బ్రిటీష్ పాలనలో పోలీసులు ఉపయోగించారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.




Claim Review:వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న ఈ సైకిల్ ను భారత్ లో బ్రిటీష్ పాలనలో పోలీసులు ఉపయోగించారా..?
Claimed By:FaceBook Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story