Fact Check : మహిళను బహిరంగంగా కాలుస్తున్న వీడియోకు.. ప్రస్తుత ఆఫ్ఘన్ పరిస్థితులకు ఎటువంటి సంబంధం లేదా..?

Video of Woman Shot in Head not Linked to Current Afghanistan Crisis. ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Aug 2021 2:04 PM GMT
Fact Check : మహిళను బహిరంగంగా కాలుస్తున్న వీడియోకు.. ప్రస్తుత ఆఫ్ఘన్ పరిస్థితులకు ఎటువంటి సంబంధం లేదా..?

ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే..! ఈ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకున్న ఘటనలు అంటూ పలు వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి.


ఓ మహిళను కొందరు వ్యక్తులు బహిరంగంగా చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పబ్లిక్ లో మహిళను చంపిన ఘటనలు ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకుందని చెబుతూ కొందరు వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు. మహిళ మోకాళ్లపై కూర్చుని ఉండగా తల మీద తుపాకీని గురి పెట్టి చంపడం ఆ వీడియోలో ఉంది.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వీడియోకు.. ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ లో ఘటనలకు ఎటువంటి సంబంధం లేదు.

వైరల్ అవుతున్న వీడియో అరబిక్ లో ఉన్న బోర్డులను చూడొచ్చు. అలాగే ఆ వ్యక్తులు అరబిక్ లో మాట్లాడుతూ ఉండడాన్ని మనం వినొచ్చు. కానీ ఆఫ్ఘనిస్తాన్ లో మాట్లాడే భాషలు 'పాస్తో, దారి'.

ఈ వైరల్ వీడియో ఇప్పటిది కాదని 2015లో చోటు చేసుకుందని స్పష్టంగా తెలుస్తోంది. సిరియాలో 2015 లో అల్-ఖైదా తీవ్రవాదులు మహిళను వ్యభిచారం చేస్తున్నందుకు గానూ బహిరంగంగా హత్య చేశారు.

Mirror మీడియా రిపోర్టుల ప్రకారం.. సదరు మహిళ పై నుండి కింద వరకూ బుర్ఖాను ధరించింది. ఆమెను మోకాళ్ళపై కూర్చోమని తీవ్రవాదులు చెప్పారు. ఎంతో మంది ఈ ఘటనను చూస్తూ ఉండగా.. మరికొందరు ఫోన్లతో రికార్డు చేయడాన్ని గమనించవచ్చు. మాస్కులు వేసుకున్న తీవ్రవాదుల్లో ఒకరు అందరూ చూస్తూ ఉండగా 'షరియా కోర్టు' లో ఆమెను చంపేశారు. ఆ మహిళ తన భర్తకు తెలియకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నందుకు ఈ శిక్ష విధించారు. ఈ విషయాన్ని Independent అరబిక్ న్యూస్ ఆర్గనైజేషన్ Assawsana కూడా కథనాలను ప్రచురించాయి.

Orinoco Tribune, New Covenant Network News, MR Online వంటి మీడియా సంస్థలు అప్పట్లో కథనాలను ప్రచురించాయి. "Syria's al-Qaeda affiliate Jabhat al-Nusra executing a woman in public in Idlib in 2015 after she was accused of adultery" అంటూ వార్తలు వచ్చాయి.

కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు చోటు చేసుకుంటున్న ఘటనలకు.. ఈ వైరల్ వీడియోకు ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.


Claim Review:మహిళను బహిరంగంగా కాలుస్తున్న వీడియోకు.. ప్రస్తుత ఆఫ్ఘన్ పరిస్థితులకు ఎటువంటి సంబంధం లేదా..?
Claimed By:Whatsapp Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Whatsapp
Claim Fact Check:False
Next Story