నిజమెంత: పశ్చిమ బెంగాల్ లో భద్రతా బలగాలపై ప్రజలు దాడులకు తెగబడ్డారా?
లోక్‌సభ ఎన్నికల్లో ఆరో దశ పోలింగ్ మే 25న ముగిసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 May 2024 9:15 AM ISTనిజమెంత: పశ్చిమ బెంగాల్ లో భద్రతా బలగాలపై ప్రజలు దాడులకు తెగబడ్డారా?
లోక్‌సభ ఎన్నికల్లో ఆరో దశ పోలింగ్ మే 25న ముగిసింది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఆరో దశలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అక్కడక్కడా హింసాత్మక సంఘటనలు జరిగాయి. అత్యధికంగా 79.47 శాతం పోలింగ్ నమోదైంది.
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో భద్రతా బలగాలపై దాడులు జరుగుతున్నట్లు ఓ వీడియో ఒకటి వైరల్‌గా మారింది.
ఆరవ దశ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్ గ్రామంలో భద్రతా సిబ్బందిపై దాడి అనే శీర్షికతో ట్విట్టర్ వినియోగదారు వీడియోను షేర్ చేశారు. పశ్చిమ బెంగాల్ లో భద్రతా బలగాలపై ప్రజలు దాడులకు తెగబడ్డారా?
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
వీడియోలో కేవలం భద్రతా సిబ్బందిపైనే కాకుండా బీజేపీ ఎంపీ అభ్యర్థిపై కూడా దాడి జరిగినట్లు మనం గమనించవచ్చు. దీన్ని బట్టి ఈ వాదన ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము వైరల్ వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించాం. పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల ఆరవ దశ సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనకు సంబంధించిన అనేక వార్తా నివేదికలను మేము కనుగొన్నాము.
పశ్చిమ బెంగాల్‌లోని ఝర్‌గ్రామ్‌కు చెందిన బీజేపీ అభ్యర్థి ప్రనాథ్ తుడుపై ఓ గుంపు దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఒక గుంపు రాళ్లు రువ్వడం, ప్రణత్.. ఆయన కాన్వాయ్‌ను వెంబడించడం చూపిస్తుంది. దాడి జరగడంతో భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని సురక్షితంగా ఘటనా స్థలం నుంచి తరలించారు. ఈ ఘటనలో బీజేపీ నాయకుడి కారు కూడా ధ్వంసమైందని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా కథనం పేర్కొంది.
మే 25 న ANI న్యూస్ కూడా X లో వీడియోను పోస్ట్ చేసింది. ఝర్‌గ్రామ్ లోక్‌సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థి ప్రణత్ మొంగ్లాపోటా నియోజకవర్గంలోని బూత్ నంబర్ 200ని సందర్శించినప్పుడు ఈ దాడి జరిగింది.
#WATCH | West Bengal | BJP candidate from Jhargram Lok Sabha seat, Pranat Tudu was attacked allegedly by miscreants when he was visiting booth number 200 in Monglapota in the parliamentary constituency today pic.twitter.com/bfEYH7KgXT
— ANI (@ANI) May 25, 2024
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అభ్యర్థిపై ఓ గుంపు దాడి చేయడానికి ప్రయత్నించగా.. భద్రతా దళాలు బీజేపీ అభ్యర్థికి రక్షణగా నిలిచాయి. కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.