కొన్ని వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన దుష్ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. బీజేపీ రోడ్‌షో సందర్భంగా ఘర్షణ చెలరేగుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది. తమిళనాడులో ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలను కొట్టారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
“ఇప్పుడే తమిళనాడులో జరిగింది. ప్రజలు ప్రచార రథాల నుండి బీజేపీ నాయకులను దించుతున్నారు” అని వీడియోను ఒక ట్విట్టర్ వినియోగదారుడు షేర్ చేశారు.
చాలా మంది X వినియోగదారులు అదే వాదనతో వీడియోను షేర్ చేసారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
2023లో ఒడిశాలో జరిగిన రోడ్‌షో సందర్భంగా బీజేపీ నేతల మధ్య జరిగిన గొడవ వైరల్ వీడియోలో ఉంది. ఈ వాదన ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.
ఈ పోస్ట్‌పై కామెంట్లను పరిశీలించినప్పుడు వీడియో ఒడిశాకు చెందినదని చెబుతున్న వినియోగదారుని కామెంట్ ను మేము గుర్తించాం.
ఈ సూచనతో, మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్‌ని అమలు చేసాము. ఒడిషా బైట్స్ అక్టోబర్ 9, 2023 న 'ఒడిశా: బలంగీర్‌లో రాష్ట్ర అధ్యక్షుడి ర్యాలీ సందర్భంగా ఇద్దరు బీజేపీ నాయకుల మధ్య గొడవ' అనే శీర్షికతో ఒక నివేదికను కనుగొన్నాం. వైరల్ వీడియోను అందులో నుండే తీసుకున్నారని మేము గుర్తించాం.
నివేదిక ప్రకారం, ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ సమాల్ ర్యాలీ సందర్భంగా గొడవ జరిగింది. ర్యాలీ RTO చౌక్ మీదుగా వెళుతుండగా, బీజేపీ జిల్లా నాయకులు అనంత్ దాస్, అతని సహచరుడు బలరామ్ సింగ్ యాదవ్ సామల్‌కు పుష్పగుచ్ఛం అందించడానికి వెళ్లారు. అయితే మరో స్థానిక నాయకుడు గోపాల్‌జీ పాణిగ్రాహి అడ్డుకోవడంతో తోపులాటకు దారి తీసింది.
అక్టోబర్ 9, 2023 నుండి ఒడిశా రిపోర్టర్ కి సంబంధించిన మరో నివేదికలో కూడా మేము ఒకే విధమైన చిత్రాన్ని కనుగొన్నాము. జీపులో ఎక్కి రామ్మోహన్ సమాల్‌కి పువ్వులను సమర్పించడానికి ప్రయత్నించిన అనంత్ దాస్‌ను గోపాల్జీ ఆపడంతో ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. ఆ తర్వాత వారి మద్దతుదారులు కూడా గొడవకు దిగారు.
2023 అక్టోబరు 9న ఒడిశా టీవీ కూడా ‘రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి బొలంగీర్ ర్యాలీ సందర్భంగా బీజేపీ నేతల మధ్య గొడవ’ శీర్షికతో నివేదించిన సంఘటనను కూడా మేము కనుగొన్నాము. ఈ నివేదికలోని వైరల్ క్లిప్ 1:23 నిమిషాల మార్క్‌లో కనిపిస్తుంది.
2023లో ఒడిశాలో జరిగిన గొడవను చూపించే వైరల్ క్లిప్ ఇదని మేము నిర్ధారించాము. ఆ వీడియో తమిళనాడుకు చెందినది అనే వాదన ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉంది.
Credits : Md Mahfooz Alam