కొంతమంది పురుషులు బహిరంగంగా బట్టలు విప్పి నిరసన ప్రదర్శన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫుటేజ్ మణిపూర్ లో చోటు చేసుకుందని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు.
మణిపూర్ లో ప్రజలు ఎలా నిరసన తెలుపుతున్నారో చూడండి" ( “See how people are protesting for #Manipur unexpected behaviour.”) అనే క్యాప్షన్‌తో ఒక ట్విట్టర్ వినియోగదారు వీడియోను షేర్ చేసారు. (viewer discretion advised)
నిజ నిర్ధారణ :
ఈ వైరల్ వీడియోకు మణిపూర్ హింసకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది.
వీడియో కీఫ్రేమ్స్ కు సంబంధించిన రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మేము జూలై 19న ఒక వినియోగదారు ట్వీట్ చేసిన వీడియోను చూశాం. ఆ వీడియో నిడివి ఎక్కువగా ఉంది. అందులో కొన్ని వివరాలు మాకు కనిపించాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగల (ST) యువకులు నగ్నంగా నిరసన తెలుపుతున్నారని, నకిలీ కుల ధృవీకరణ పత్రాలను ఉపయోగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ పని చేశారు.
జూలై 18న జీ న్యూస్ ఇదే వీడియోను ప్రచురించింది. నకిలీ కుల ధృవీకరణ పత్రాలను ఉపయోగించి ఉద్యోగాలు పొందిన వారిపై నిరసన వ్యక్తం చేస్తూ ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన యువకులు ఛత్తీస్‌గఢ్ విధానసభకు నగ్నంగా చేరుకున్నారు.
"నకిలీ కుల ధృవీకరణ పత్రాలపై ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో పురుషుల నగ్న నిరసన" అనే అర్థం వచ్చేలా జూలై 18న NDTV నివేదిక ఇచ్చింది. అందులో వైరల్ వీడియోలోని స్టిల్‌ను కూడా మేము కనుగొన్నాము.
రాష్ట్ర శాసనసభ వైపు వెళుతున్న డజన్ల కొద్దీ నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
ఈ నిరసనకు సంబంధించి ఆజ్ తక్, దైనిక్ భాస్కర్ మీడియా సంస్థలు కూడా నివేదించాయి.
ఛత్తీస్‌గఢ్‌లో పురుషుల నిరసనకు సంబంధించిన వైరల్ వీడియోను మణిపూర్ సంక్షోభంతో తప్పుగా ముడిపెట్టారని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam