ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు, పలు నదులు ఉప్పొంగడంతో జల విలయం తలపించింది. గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని వర్షాలను, వరదలను రాయసీమ జిల్లాల ప్రజలు చూసారు. ఇటీవల వరదల సమయంలో పెద్ద ఎత్తున మూగజీవాలు ప్రాణాలను కోల్పోయాయంటూ.. వరదల్లో ఆవులు కొట్టుకుని పోతున్న వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.
భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండియా ఎహెడ్ న్యూస్ పశువులు కొట్టుకుపోతున్న వీడియోను ట్వీట్ చేసింది. ఆ వీడియో ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి వరదల సమయంలోనిదని పేర్కొంది.
APN News అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా November 20న వీడియోను పోస్ట్ చేశారు. "Watch: Animals Swept Away In Flood Water At Andhra Pradesh; Many lost Lives Due To Heavy Rainfall" అంటూ వీడియోను అప్లోడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న ఘటన అంటూ చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
NewsMeter గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించింది. 28 జూలై 2020న YouTube ఛానెల్ Efrain Grande Tepic ద్వారా అప్‌లోడ్ చేయబడిన వీడియోను కనుగొన్నారు. వీడియో యొక్క వివరణ ప్రకారం, హన్నా హరికేన్ కారణంగా కొంచల్ నది పొంగిపొర్లడానికి కారణమైంది. పశువులు కొట్టుకొని పోతున్న ప్రాంతాన్ని లాస్ వరాస్, కంపోస్టెలాగా గుర్తించారు.
Imagen Noticias అనే యూట్యూబ్ ఛానల్ లో వీడియోను పోస్టు చేశారు. ఇండియా ఎహెడ్ న్యూస్ షేర్ చేసిన విజువల్స్ 0:02 సెకండ్ మార్క్ వద్ద కనిపిస్తాయి.
బ్రెజిల్ కు చెందిన Conexão GeoClima 28 జులై 2020న ఇదే వీడియోను ట్వీట్ చేశారు. అయితే అది డిఫరెంట్ యాంగిల్ లో తీసినదిగా గుర్తించారు. 7 ఆగస్టు 2020 న లా తేజ అందించిన నివేదికలో అదే వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌ను కలిగి ఉంది. మెక్సికో మరియు యునైటెడ్ స్టేట్స్‌ను తాకిన హన్నా హరికేన్ గడిచిన తర్వాత నయారిట్‌లోని జకువల్పాన్ నదిలో జూలై 28న సంభవించిన వరదల నుండి చిత్రాలు ఉన్నాయని తెలిపింది.
అందువల్ల వైరల్ పోస్టులు తప్పు అని స్పష్టమైంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలకు.. వైరల్ వీడియోలో ఆవులు వరద నీటిలో కొట్టుకుపోతున్న దానికి ఎలాంటి సంబంధం లేదు. వైరల్ వీడియో 2020లో మెక్సికో దేశానికి సంబంధించినది.