గోవిందరాజ స్వామి ఆలయంలో 100 కిలోల బంగారాన్ని దొంగిలిస్తూ ముస్లిం వ్యక్తులు పట్టుబడ్డారని సోషల్ మీడియా వినియోగదారులు వీడియోను షేర్ చేస్తున్నారు.
ఆలయంలో బంగారు తాపడం చేయడానికి వారిని నియమించినట్లు కూడా పేర్కొన్నారు.
నిజ నిర్ధారణ :
గోవిందరాజ స్వామి ఆలయంలో బంగారం చోరీకి గురైందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) న్యూస్‌మీటర్‌కు స్పష్టం చేసింది. అబద్ధాలను కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వారిపై చర్యలు తప్పవని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తిరుపతిలో బంగారం పనులు జరుగుతున్న ఓల్డ్ హుజూర్ ఆఫీస్ సీసీ కెమెరాల నిఘాలో ఉందని తెలిపారు. వర్కింగ్ ఏరియాలోకి ప్రవేశించే వారు రిజిస్టర్‌లో తమ వివరాలను నమోదు చేయాలి. స్ట్రాంగ్ రూమ్‌లో విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులు కాపలాగా ఉంటారు. తిరుమల జీయంగార్‌స్వామీజీలు, ఇతర అనుభవజ్ఞులైన స్తపతుల పర్యవేక్షణలో సంప్రదాయ శిల్ప శాస్త్ర సూత్రాల ప్రకారం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని టీటీడీ తెలిపింది.
బంగారాన్ని ముస్లిం వ్యక్తి దొంగిలించాడన్న ఆరోపణపై టీటీడీ అధికారులు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ జ్యోతి ముస్లిం స్నేహితురాలు వివాహానికి ఆహ్వానించేందుకు వచ్చారని తెలిపారు. అది కూడా గోల్డ్ వర్క్స్ జరుగుతున్న ప్రాంగణం బయట కలిశారు. ముస్లిం వ్యక్తికి ఎలాంటి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వలేదని కూడా టీటీడీ స్పష్టం చేసింది.
తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ సోషల్ మీడియాలో వైరల్ వాడుతున్న వీడియోతో పాటు ఫేక్ క్లెయిమ్ లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది. ఆలయంలో బంగారం దొంగిలించడాన్ని టీటీడీ అధికారి, కాంట్రాక్టర్ ఖండించిన వీడియోలను కూడా వారు పోస్ట్ చేశారు.
Credits : Md Mahfooz Alam