అధికారులు చేస్తున్న భూమి పూజపై ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకకు చెందినదని దీన్ని షేర్ చేస్తున్న వ్యక్తులు పోస్టులు చేస్తున్నారు.
ఒక ట్విట్టర్ యూజర్ వీడియోను షేర్ చేసి, “PWD అధికారులు భూమి పూజకు కేవలం పూజారిని మాత్రమే పిలిచినందుకు ఓ నాయకుడు కోపంగా ఉన్నాడు, ఇది కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటక” అని పోస్టుల్లో రాశారు.
నిజ నిర్ధారణ :
ఈ వీడియో 2022 నాటిదని మరియు తమిళనాడుకు చెందినదని NewsMeter కనుగొంది. రాష్ట్ర అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె)కి చెందిన లోక్‌సభ ఎంపి ఎస్.సెంథిల్‌కుమార్ భూమి పూజపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
వీడియోలో ఉన్న వ్యక్తి తమిళం మాట్లాడటాన్ని గమనించాం. ప్రభుత్వ కార్యక్రమంలో ఒక నిర్దిష్ట మతానికి చెందిన ప్రార్థనలు ఉండకూడదని అతనికి తెలుసా అని ప్రభుత్వ అధికారిని ప్రశ్నించడం మేము గమనించాము. ఇతర మతాలకు చెందిన వారు ఎక్కడున్నారని కూడా ఆయన ప్రశ్నించారు.
దీని నుండి క్యూ తీసుకొని, మేము కీవర్డ్ సెర్చ్ చేసాము. 17 జూలై 2022 న ది న్యూస్ మినిట్ ప్రచురించిన ఒక నివేదికను కనుగొన్నాము. తమిళనాడులో ఒక లేక్ రేనోవేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి భూమి పూజ నిర్వహించారు. ఆ సమయంలో ధర్మపురి ఎంపి ఎస్.సెంథిల్‌కుమార్ అక్కడికి చేరుకున్నారు. ఆ స్థలంలో ఒక పూజారి మాత్రమే ఉన్నందుకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) అధికారిని మందలించారు.
16 జూలై 2022న డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం ధర్మపురికి చెందిన డిఎంకె ఎంపి సెంథిల్‌కుమార్ ప్రభుత్వ కార్యక్రమంలో నిర్వహించే హిందూ ఆచారాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళనాడులో ప్రతి మతాన్ని సమానంగా చూడాలని, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పాలనలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.
16 జూలై 2022న సెంథిల్‌కుమార్ వీడియోను ట్వీట్ చేసినట్లు కూడా మేము కనుగొన్నాము.
ఈ ఘటన తమిళనాడులో జరిగినట్లుగా వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam