FactCheck : వైరల్ వీడియోలో ఉన్న రథం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కదిరి లక్ష్మీ నరసింహ స్వామిదేనా..?

This Video is not Related to the Chariot Festival at APs Lakshmi Narasimha Swamy Temple. ఆంధ్రప్రదేశ్‌లోని కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న రథోత్సవానికి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 March 2022 8:30 PM IST
FactCheck : వైరల్ వీడియోలో ఉన్న రథం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కదిరి లక్ష్మీ నరసింహ స్వామిదేనా..?

ఆంధ్రప్రదేశ్‌లోని కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న రథోత్సవానికి సంబంధించిన వీడియో అంటూ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.


పెద్ద ఎత్తున ప్రజలు రథం చుట్టూ గుమికూడి ఉన్నారు. దీంతో ఇదే నిజమైన రథోత్సవంకు సంబంధించిన వీడియో అని పలువురు పోస్టులు పెట్టారు.

https://fb.watch/c06rVJI7O4/

నిజ నిర్ధారణ :

వైరల్ పోస్టు ప్రజలను తప్పుదారి పట్టించేది.

NewsMeter బృందం Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. ఇలాంటి వీడియోలను కనుగొంది. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అదే వీడియోను "తిరువారూర్ రథోత్సవం" అని పేర్కొంటూ భిన్నమైన వివరణతో పోస్ట్ చేసారు. అది తమిళనాడుకు చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రానికి సంబంధించిన రథోత్సవం.

15 మార్చి 2022న Polimer News ప్రత్యక్ష ప్రసారం చేసిన 'తిరువారూర్ రథోత్సవం' వీడియోలో అదే రథాన్ని, ఇలాంటి పరిసరాలను చూడవచ్చు. వీడియోలోని పలు చోట్ల మనం తమిళంలో ఉన్న హోర్డింగ్ లను కూడా చూడవచ్చు.


కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగిన రథోత్సవానికి సంబంధించిన వాస్తవ దృశ్యాలను చూడవచ్చు. పలు తెలుగు మీడియా సంస్థలు 'కదిరి తేరు' కు సంబంధించిన వీడియోలను ప్రసారం చేశాయి.


కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'



































Claim Review:వైరల్ వీడియోలో ఉన్న రథం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కదిరి లక్ష్మీ నరసింహ స్వామిదేనా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:Misleading
Next Story