కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డి.కె. శివకుమార్ అడ్డదిడ్డంగా నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటక ఎన్నికలకు ముందు ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో శివకుమార్ తాగిన స్థితిలో ఉన్నట్లు వీడియోను షేర్ చేస్తున్న వారు పేర్కొన్నారు.
నిజ నిర్ధారణ :
NewsMeter వైరల్ వీడియో గురించి వెతకగా.. ఆ వీడియో జనవరి 2022 నాటిదని కనుగొంది. D.K. శివకుమార్ కర్ణాటకలో పాదయాత్రలో ఉన్నారు.
వైరల్ అవుతున్న పోస్టులో “newsfirstkannada” అని ఉండడాన్ని మేము గమనించాం. దీన్ని క్యూగా తీసుకుని, మేము కీవర్డ్ సెర్చ్ చేసాము. 9 జనవరి 2022న న్యూస్‌ఫస్ట్ కన్నడ వెరిఫైడ్ యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన వైరల్ వీడియోని కనుగొన్నాము. మేకెదాటు పాదయాత్ర సమయంలో శివకుమార్ అలసిపోయి కనిపించారని వీడియో క్యాప్షన్ పేర్కొంది.
9 జనవరి 2022న వినియోగదారులు ట్వీట్ చేసిన వీడియోను కూడా మేము కనుగొన్నాము.
10 జనవరి 2022 న ఔట్‌లుక్ నివేదిక ప్రకారం, కోవిడ్ -19 పరిమితులను ధిక్కరిస్తూ.. మేకేదాటు రిజర్వాయర్ ప్రాజెక్టును డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ప్రారంభించింది. ఈ పాదయాత్ర కారణంగా సిద్దరామయ్య, డీకే శివకుమార్ సహా పార్టీ సీనియర్ నేతలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు కూడా పేర్కొంది.
ఆ సమయంలో శివకుమార్ మత్తులో ఉన్నారో లేదో న్యూస్ మీటర్ ధృవీకరించలేకపోయింది. అయితే, వీడియో జనవరి 2022 నాటిదని మేము ధృవీకరించగలము. వైరల్ వీడియో 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో తప్పుగా లింక్ చేశారని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam