Fact Check : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మార్చి 1 నుండి రెండు నెలల పాటూ సెలవులను ప్రకటించాయా..?

Telangana, AP have not announced 2-month holiday for schools, colleges. గవర్నమెంట్ ఆర్డర్ కాపీలలాగా అనిపించే

By Medi Samrat  Published on  28 Feb 2021 9:23 AM IST
Telangana, AP have not announced 2-month holiday for schools, colleges

గవర్నమెంట్ ఆర్డర్ కాపీలలాగా అనిపించే రెండు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఆర్డర్లను తలపిస్తూ ఉన్నాయి. మార్చి నెల నుండి మే నెల వరకూ పాఠశాలలను మూసి ఉంచేస్తూ ఉన్నామని ఇందులో తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లోగోలు, ఆ రాష్ట్రాలకు చెందిన రాజకీయనాయకులు కూడా ఆ లెటర్ హెడ్స్ లో ఉన్నారు.




ఈ రెండు లెటర్స్ లోనూ ముఖ్యమంత్రులు, అలాగే విద్యాశాఖ మంత్రులు కూడా ఉన్నారు. "For all the schools and colleges, from March 1st to May 7th declared holidays, due to increasing of the covid-19 cases. This G.O should be passed to all education department and follow the restrictions of the board. Order by Chief Minister of TS (sic)." "అన్ని స్కూల్స్ కు, కాలేజీలకు మార్చి 1 నుండి మే 7 వరకూ సెలవులు ప్రకటించడం జరిగింది.. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జీవోను విద్యాశాఖ పంపించడం జరిగింది. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయం" అని అందులో ఉంది. ఆ ఆర్డర్ మీద తెలంగాణ గవర్నమెంట్, విద్యాశాఖ అని ఉండడాన్ని గమనించవచ్చు.




అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఓ లెటర్ హెడ్ కూడా ప్రచారం అవుతూ ఉంది. మార్చి 1 నుండి మే 4 నాలుగు వరకూ సెలవులు అంటూ అందులో తెలిపారు. "Yours Sincerely, Chief Minister" "Yours Honourable, Education Minister" అంటూ ఉంది. అలాగే పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా ఉండడమే కాకుండా లోగో కూడా గమనించవచ్చు.




ఒక రెడ్ స్టాంప్ కూడా రెండు లెటర్లలో గమనించవచ్చు.

నిజ నిర్ధారణ:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రెండు నెలల పాటూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

వైరల్ అవుతున్న రెండు ఫోటోలలో ఎన్నో తప్పులను గమనించవచ్చు. ఇక గవర్నమెంట్ ఆర్డర్స్ లో ముఖ్యమంత్రి కానీ.. ఎవరిదైనా మంత్రులది కానీ ఫోటోలు ఉండవు. జీవోలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని మొదలవుతాయి. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ.. గవర్నమెంట్ ఆఫ్ టీఎస్.. లతో మొదలవ్వవు. ఇక ఈ లెటర్లలో ఎన్నో తప్పులను గమనించవచ్చు. ఇక కొన్ని పదాల స్పెలింగ్ మిస్టేక్స్ కూడా గమనించవచ్చు.

ఈ వదంతులపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఇవన్నీ అబద్ధాలని కొట్టివేశారు. ప్రభుత్వం పాఠశాలలను మూసివేయడం లేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ సాకు చూపి మార్చి 1వ తేదీ నుండి పాఠశాలలకు సెలవులంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదన్నారు. అది పూర్తిగా అవాస్తవం.. దాన్ని ఎవరూ వైరల్ చేయద్దన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. సైబర్ క్రైమ్‌లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని, అందులో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. జూనియర్ కళాశాలలు కూడా షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని వెల్లడించారు.

https://www.thehindu.com/news/national/andhra-pradesh/primary-schools-in-ap-to-reopen-from-feb-1/article33700184.ece

తెలంగాణ రాష్ట్రంలో కూడా పాఠశాలలు తెరచుకొని చాలా రోజులే అవుతున్నాయి. తొమ్మిదో తరగతి పైన స్కూల్స్, కాలేజీలు తెరుచుకున్నాయి. ఆరో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకూ మార్చి 3 నుండి పాఠశాలలు తెలంగాణలో తెరచుకోనున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు స్కూల్స్ ను తెరిచామని ఆమె మీడియాకు తెలిపారు.

https://indianexpress.com/article/cities/hyderabad/schools-in-telangana-to-reopen-from-february-1-7142799/

https://timesofindia.indiatimes.com/city/hyderabad/t-order-to-reopen-classes-6-8-from-today-has-worried-parents-fuming/articleshow/81181230.cms

వైరల్ అవుతున్న రెండు ఫోటోలు ఎడిట్ చేసినవి.. వాటిలో ఎటువంటి నిజం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రెండు నెలల పాటూ పాఠశాలలను మూసి వేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.




Claim Review:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మార్చి 1 నుండి రెండు నెలల పాటూ సెలవులను ప్రకటించాయా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media
Claim Fact Check:False
Next Story