ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా డిసెంబర్ 21న రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను చేపట్టాయి పార్టీ శ్రేణులు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. లక్ష మందికిపైగా కార్యకర్తలు రక్తదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ ఈ విషయాన్ని షేర్ చేశారు. "మరోసారి వైయస్ఆర్ సీపీ గిన్నీస్ రికార్డ్" అని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. గౌ శ్రీ సీఎం YS Jagan Mohan Reddy గారి పుట్టిన రోజు సందర్భంగా లక్షా 29 వేల మందికి పైగా ysrcpblooddonation.com వెబ్ సైట్ లో బ్లడ్ డొనేషన్ ప్లెడ్జ్ రిజిస్ట్రేషన్ చేశారు అని అది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయిందని సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.
ట్విట్టర్లో కూడా "గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్" సర్టిఫికెట్ RECORD FOR MASSIVE PLEDGE ON BLOOD DONATION కు వచ్చిందని మరొక నెటిజన్ పోస్ట్ చేశారు.
మరోవైపు The Times Of India దిన పత్రిక కూడా వై ఎస్ ఆర్ సి పి గిన్నిస్ బుక్ లోకి ఇంటర్ అయినట్టుగా ఈ వార్తను ప్రచురించింది.
నిజనిర్ధారణ :
నిజంగానే వైయస్సార్సీపి చేపట్టిన రక్తదాన కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు సాధించింది?! ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. నెటిజన్స్ పోస్టు చేసిన వీడియోను, ఫోటోలను పరిశీలించినపుడు ఇందులో చాలా స్పష్టంగా GENIUS BOOK OF RECORDS రాసి ఉంది. దీంతో గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. 1, 29, 451 మంది 24 గంటల్లో స్వచ్ఛందంగా రక్తదానం చేస్తామని ప్రతిజ్ఞ చేసారని, అది జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎంటర్ అయినట్టుగా ఆ సంస్థ ప్రతినిధి వీరూ మామ ప్రకటించినట్టుగా ఈ వీడియోలో ఉంది.
ఇక ఇదే విషయాన్ని వైయస్సార్సీపి అధికారిక ట్విట్టర్ అకౌంట్ కూడా పోస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి largest ever blood donation drive సందర్భంగా ఎంటర్ అయినట్టుగా అందులో ఉంది .
అయితే ఈ ఫాక్ట్ ఆర్టికల్ ప్రచురించే సమయానికి Genius Book Of Records ఇంకా ఆ రికార్డ్ ని తన వెబ్సైట్లో నమోదు చేయలేదు.
అయితే ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా 24 గంటల్లో అత్యధికంగా బ్లడ్ డొనేట్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది సౌత్ కొరియా కి చెందిన వాలంటీర్లు. 2 Oct, 2022 రోజున 71,121 మంది రక్త దానం చేసినట్టుగా రికార్డ్స్లో ఉంది.
https://www.guinnessworldrecords.com/world-records/714849-most-people-to-sign-up-as-blood-donors-online-in-24-hours
సో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదినం రోజున వైఎస్ఆర్ సీపీ చేపట్టిన రక్తదాన శిబిరాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కాయి అన్న సోషల్ మీడియా పోస్టుల్లో నిజం లేదు. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మాత్రమే ఎంటర్ అయింది.