FactCheck : 52 ఏళ్ల బామ్మ 21 ఏళ్ల అబ్బాయితో ప్రేమ పెళ్ళి నిజమేనా ?!
Scripted video shared as 52 year old woman marrying 22 year old man. 52 ఏళ్ల బామ్మతో 21 ఏళ్ల కుర్రాడి ప్రేమ పెళ్లి అనే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
52 ఏళ్ల బామ్మతో 21 ఏళ్ల కుర్రాడి ప్రేమ పెళ్లి అనే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వయసులో వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆ ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు అంటూ ఒక వీడియో ఫేస్బుక్లో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది.
52 ఏళ్ల బామ్మ 21 ఏళ్ల కుర్రాడి ప్రేమ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో నిజమెంత? ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఇందుకోసం గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు All in one NEWs అనే యూట్యూబ్ ఛానల్ లో దీనికి సంబంధించిన ఒక వీడియో కనిపించింది. వీడియో క్రెడిట్ ను క్రియేటర్ @techparesh కు ఇచ్చింది
దీంతో @techparesh ఇన్స్టా సెర్చ్ చేసి చూసినప్పుడు డిసెంబర్ 3 వ తారీకున ఈ వీడియో అప్లోడ్ చేసినట్టుగా తెలిసింది.
అయితే ఈ ఇన్స్టా అకౌంట్లో అప్లోడ్ చేసేవన్నీ scripted వీడియోస్. ఇందులో నటించిన ఇద్దరు యాక్టర్లు ఇతర వీడియోల్లో కూడా నటించారు. వైరల్ అయిన ఈ వీడియోలో కనిపించిన అబ్బాయే మరొక వీడియోలో కూడా కనిపించాడు. అండర్ ఏజ్ పిల్లలు ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తుంది.
ఇక టెక్ పరేష్ పేరుతో మరొకసారి కీ వర్డ్ సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్ లో Paresh Sathaliya అనే గుజరాతి ఛానల్ కనిపించింది.
video is for educational purpose only అని చెబుతూ scripted వీడియోస్ అప్లోడ్ చేశారు ఈ యూట్యూబ్ ఛానల్ లో.
ఈ వీడియోలను గమనించినట్లయితే వీటిలో ఉన్న మహిళ ఒక్కరే. ఒక వీడియోలో ఆ మహిళ ఒక మతానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తే, మరొక వీడియోలో ఇంకొక మతానికి చెందిన మహిళగా కనిపిస్తారు. అది కూడా వేరే వేరే వ్యక్తులకు జంటగా కనిపిస్తారు.
సో, సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయింది ఒక స్క్రిప్టెడ్ వీడియో. 52 ఏళ్ల బామ్మతో 21 ఏళ్ల కుర్రాడు ప్రేమ పెళ్లి చేసుకున్న దృశ్యాలని షేర్ చేస్తున్న దాంట్లో ఏ మాత్రం నిజం లేదు.
Claim Review:52 ఏళ్ల బామ్మ 21 ఏళ్ల అబ్బాయితో ప్రేమ పెళ్ళి నిజమేనా ?!