Fact Check : ఏలూరు అగ్రహారంలో హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారా..?

Photo of vandalized Hanuman idol from 2014 falsely linked to recent AP temple attacks. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు అగ్రహారంలో హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం.

By Medi Samrat  Published on  26 Jan 2021 3:59 AM GMT
fact check news of AP Temple attacks
ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో ఆలయాల మీద దాడులు.. విగ్రహాల ధ్వంసం ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి సమయంలో చాలా మంది సామాజిక మాధ్యమాల్లో విగ్రహాల ధ్వంసంపై పోస్టులు పెట్టారు.



తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మరో ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు అగ్రహారంలో ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ ట్వీట్లు చేశారు. అలాగే ఫేస్ బుక్ లో కూడా ఈ పోస్టు వైరల్ అవుతూ ఉంది.



Archive links: https://web.archive.org/save/https://www.facebook.com/gopala.krishnayashavanthapura/posts/5043616289042073

https://web.archive.org/save/https://twitter.com/hindu36/status/1351617971441995778

నిజ నిర్ధారణ:

హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన 2014లో చోటు చేసుకుంది.

ఈ ఘటన 2014 సంవత్సరంలో చోటు చేసుకుందని.. అందుకు సంబంధించిన కేస్ నంబర్.. ఇతర వివరాలను కూడా పశ్చిమ గోదావరి పోలీసులు తెలియజేశారు. ఈ ఘటన 2014 సంవత్సరంలో చోటు చేసుకుందని.. ఏలూరు వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. Cr No 225/14 U/S 295, 427 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 35 సంవత్సరాల పేరక వెంకటేశ్వర రావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ లో ఈ ఘటనకు తానే బాధ్యుడినని వెంకటేశ్వర రావు ఒప్పుకోగా.. అతడికి 8 నెలల జైలు శిక్షను విధించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెకింగ్ పేజీలో కూడా వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదని తెలిపింది.

"#FactCheck - Images of the vandalized Anjaneya Swamy temple in Eluru, West Godavari are from 2014. Prompt action initiated by @SpWestgodavari. To know more - https://bit.ly/3qCMz9M Reminder to refrain from posting false information as it may lead to legal ramifications." అంటూ ట్వీట్ చేసింది.


ఈ కేసుకు సంబంధించి కోర్టు జడ్జిమెంట్ కాపీని కూడా మీరు చూడొచ్చు.

FACTLY కూడా ఈ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది.

2014 సంవత్సరంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన ఫోటోను తిరిగి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.




Claim Review:ఏలూరు అగ్రహారంలో హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook, Twitter
Claim Fact Check:False
Next Story