Photo of Flipkart package with funny Hyderabad address is photoshopped. ఫ్లిప్ కార్ట్ ప్యాకేజీ మీద నవ్వు తెప్పించే డెలివరీ
By Medi Samrat Published on 21 Jan 2021 2:32 AM GMT
ఫ్లిప్ కార్ట్ ప్యాకేజీ మీద నవ్వు తెప్పించే డెలివరీ అడ్రెస్ ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. సలీమ్ లాలాకు డెలివరీ వచ్చినట్లుగా ఆ ప్యాకేజీ మీద ఉంది.
'పాషా భాయ్ కు చెందిన షాప్ దగ్గరకు వచ్చి సలీమ్ లాలా ఎక్కడ ఉంటాడో అడుగు.. డైరెక్ట్ గా మా ఇంటి దగ్గరకు వచ్చి విడిచిపెడతాడు' అని అందులో ఉంది. చార్మినార్ ప్రాంతానికి చెందిన పిన్ కోడ్ ఉంది. హైదరాబాదీ యాసలో నవ్వులు తెప్పించే ఈ అడ్రెస్ ను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వస్తున్నారు. హైదరాబాదీలు ఇలాంటివి చేయడంలో దిట్ట అంటూ చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ:
హైదరాబాదీ యాసలో అడ్రెస్ ఉన్న ఈ ఫోటో ఫేక్. ఈ అడ్రెస్ ను ఫోటో షాప్ చేసి అప్లోడ్ చేశారు.
న్యూస్ మీటర్ దీనిపై గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. జులై 2020కి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ కనిపించాయి. రాజస్థాన్ కు చెందిన ఓ అడ్రెస్ ను ఫ్లిప్ కార్ట్ సంస్థ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసింది.
ఇల్లే ఓ దేవాలయం అంటూ వచ్చేలా అడ్రెస్ ఉందని.. దాన్నే సదరు వ్యక్తి పోస్టు చేశారని చెప్పుకొచ్చారు అందులో..!
'448, Chaoth mata mandir, mandir ke samne aate hi phone laaga lena mein aa jauga (448 చావోత్ మాత దేవాలయం ముందుకు వచ్చి నాకు ఫోన్ చెయ్.. నేను వస్తాను), Shivpura, Rajasthan." అని ఉంది అందులో...! అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఫ్లిప్ కార్ట్ ఈ అడ్రెస్ ను తన ట్విట్టర్ ఖాతాలో చెప్పుకొచ్చింది.
ఫ్లిప్ కార్ట్ ఏదైతే ఫోటోను పోస్టు చేసిందో అదే ఫోటో మీద హైదరాబాదీ స్లాంగ్ తో ఉన్న అడ్రెస్ ను ఫోటోషాప్ చేశారు. ఇంతకు ముందు రాజస్థాన్ కు చెందిన బ్యాగ్ మీద ఉన్న ప్రోడక్ట్ డీటైల్స్, ధర అన్నీ గతంలో ఫ్లిప్ కార్ట్ పోస్టు చేసిన ఫోటోనే..! కాబట్టి హైదరాబాద్ యాసలో అడ్రెస్ రాసిన పోస్టు ఫేక్ అని అర్థం అవుతోంది.