FactCheck : క్రిస్మస్ రోజు టైమ్స్ స్క్వేర్ వద్ద నమాజ్ చేశారా?
రద్దీగా ఉండే ట్రాఫిక్ కూడలిలో ముస్లింలు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Dec 2023 4:50 AM GMTరద్దీగా ఉండే ట్రాఫిక్ కూడలిలో ముస్లింలు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వీడియోలో రెండు క్లిప్‌లు ఉన్నాయి.. మొదటి దాన్లో నల్ల జాకెట్ ధరించిన వ్యక్తి ప్రార్థనకు నాయకత్వం వహిస్తున్నట్లు చూపుతాయి. చివరి కొన్ని ఫ్రేమ్‌లలో భారీ బిల్‌బోర్డ్‌లతో ఉన్న బహిరంగ ప్రదేశంలో ప్రార్థనను చేస్తున్నారు. క్రిస్మస్ రోజున న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న వీడియోలు అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.
“Times Square - New York, Christmas Day, 2023, (sic)” అంటూ ఓ ఎక్స్ యూజర్ పోస్టు చేశారు. 2023 క్రిస్మస్ రోజున ఇలా చేశారంటూ ఆ వీడియోలో చూపించారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ బృందం ఈ వీడియో పాతదని.. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని కనుగొంది.
వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఫిబ్రవరి 11, 2023న వినియోగదారు పోస్ట్ చేసిన మొదటి క్లిప్‌ని ట్విట్టర్ లో మేము కనుగొన్నాము. వీడియోతో పాటుగా ఉన్న శీర్షిక, టెక్స్ట్ న్యూయార్క్ నగరంలో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నట్లుగా పేర్కొంది.
మార్చి 29, 2023న ప్రచురించిన 'ది సియాసత్ డైలీ' నివేదికలో వైరల్ వీడియోలోని విజువల్స్‌కు సమానమైన చిత్రాన్ని కూడా మేము కనుగొన్నాము. అదే వ్యక్తి ప్రార్థనలు చేయిస్తున్నట్లు అందులో చూడొచ్చు.
రంజాన్‌ను ఆచరిస్తున్న వందలాది మంది ముస్లింలు న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో తరావీహ్ ప్రార్థనలు చేశారనిఆ నివేదిక పేర్కొంది. 'ఖురాన్ పాఠకులు ఫరాజ్ హసన్, ఫైసల్ లతీఫ్' ప్రార్థనలకు నాయకత్వం వహించారని కూడా అందులో పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన హసన్ ప్రార్థన వీడియోలను మీడియా నివేదిక కలిగి ఉంది.
ఈ క్లూను తీసుకొని, మేము ఫరాజ్ హసన్ కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాని పరిశీలించాం. ఏప్రిల్ 6, 2022న పోస్ట్ చేసిన మొదటి క్లిప్‌ను కనుగొన్నాము. హసన్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో పబ్లిక్ ఫిగర్‌గా తనను తాను చెప్పుకున్నారు.
“Ramadan behaviour #timessquare #taraweeh.” అనే క్యాప్షన్ తో రెండవ క్లిప్‌ను కూడా మార్చి 27, 2023న హసన్ పోస్ట్ చేసారు.
అందువల్ల, 2023లో క్రిస్మస్ రోజున టైమ్స్ స్క్వేర్‌లో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నట్లు వైరల్ వీడియోలో చూపించలేదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Credits : Md Mahfooz Alam