బీహార్ వెనుకబాటుతనంపై భోజ్‌పురి నటుడు, గాయకుడు ఖేసరీ లాల్ యాదవ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. 4:33 నిమిషాల నిడివి గల వీడియోలో బీహార్ లో మంచి ఆసుపత్రులు, పాఠశాలలు అందుబాటులో లేకపోవడం, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లడంపై ఆయన మాట్లాడారు. ఆయన పరోక్షంగా రాజకీయ నాయకులపై విమర్శలు గుప్పించారు.. ఎవరి పేరు కూడా చెప్పలేదు.
జనవరి 12న, ఫస్ట్‌బీహార్ జార్ఖండ్ మీడియా అవుట్‌లెట్ X హ్యాండిల్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్‌పై విమర్శలు చేసారంటూ ఈ వీడియోను షేర్ చేసింది.
నిజ నిర్ధారణ :
2021లో బీహార్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పొత్తులో నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉన్నప్పటి వీడియో అని న్యూస్‌మీటర్ కనుగొంది.
పోస్ట్‌పై కామెంట్లను స్క్రోల్ చేస్తున్నప్పుడు, 12 నిమిషాల నిడివి ఉన్న వీడియో నుండి వీడియో క్లిప్ ఎడిట్ చేశారని, రెండు సంవత్సరాల క్రితం నాటి వీడియో ఇదని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నట్లు మేము కనుగొన్నాము.
ఈ సూచనను తీసుకొని.. మేము YouTubeలో సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. ధృవీకరించిన ఛానెల్, ఉజాలా ఎంటర్‌టైన్‌మెంట్ అక్టోబర్ 31, 2021న ప్రచురించిన 11:38 నిమిషాల వీడియోను కనుగొన్నాము. బీహార్‌లోని కైమూర్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వంపై యాదవ్ విరుచుకుపడ్డారని క్యాప్షన్ పేర్కొంది.
మేము పూర్తి వీడియోను చూశాము. దాదాపు 4:22 నిమిషాలకు వైరల్ క్లిప్‌ని కనుగొన్నాము. అయితే, యాదవ్ ఏ రాజకీయ నాయకుడిని పేరు పెట్టి పిలవడం మాకు ఆ వీడియోలో కనిపించలేదు.
అంతేకాకుండా, JDU, BJP, ఇతర చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని, 2020లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) క్రింద బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిందని మేము కనుగొన్నాము. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్ట్ 2022లో BJPతో తెగతెంపులు చేసుకున్నారు. రాష్ట్రీయ జనతాదళ్ (RJD), ప్రతిపక్షంలో ఉన్న ఇతర పార్టీలతో కలిసి మహా కూటమి కింద కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఖేసరీ లాల్ యాదవ్ వీడియో బీహార్‌లో ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి 2021 నాటిది. కాబట్టి, ఈ వీడియో ఇటీవలిదని, JDU-RJD కూటమిలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వాన్ని యాదవ్ విమర్శిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam