Fact Check: ఈ ఫోటో రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' కు సంబంధించినదేనా..?

Old image of Rahul Gandhi shared with misleading claim amidst 'Bharat Jodo Yatra'. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' ను చేపట్టిన సంగతి తెలిసిందే..! 'భారత్ జోడో యాత్ర', 7 సెప్టెంబర్ 22న

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Sep 2022 9:30 AM GMT
Fact Check: ఈ ఫోటో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కు సంబంధించినదేనా..?

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' ను చేపట్టిన సంగతి తెలిసిందే..! 'భారత్ జోడో యాత్ర', 7 సెప్టెంబర్ 22న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు.

తమిళనాడు రాష్ట్ర ఐటీ & సోషల్ మీడియా ప్రెసిడెంట్, CTR నిర్మల్ కుమార్, రాహుల్ గాంధీ తన మేనకోడలుతో ఉన్న పాత చిత్రాన్ని అభ్యంతరకర శీర్షికతో పాటు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కొద్దిసేపటికే వైరల్‌గా మారడంతో పరిస్థితి మరింత దిగజారింది.

ఈ ట్వీట్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. "పిల్లలకు మెహెందీ పెట్టడం ద్వారా వారితో ఆడుకుంటున్నాడు. ఇది ఇతర సభ్యులకు బాధగా ఉంది". అనే రీతిలో ట్వీట్ వైరల్ అవుతోంది.

పోస్ట్‌లను యాక్సెస్ చేయడానికి ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.

సోషల్ మీడియా వినియోగదారులు, ఇతర రాజకీయ నాయకులు CTR నిర్మల్ కుమార్ పై విమర్శలు చేస్తుండడం, విరుచుకుపడటం చూడవచ్చు. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ ఫోటోను భారత్ జోడో యాత్ర కు సంబంధించిన ఇటీవలి ఫోటోగా పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైంది. కాంగ్రెస్ దీనిని రాజకీయేతర, పార్టీయేతర జాతీయ కార్యక్రమంగా భావిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పార్టీ తన సత్తా చాటడానికి.. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా ఈ పాదయాత్రను చేస్తోంది.

నిజ నిర్ధారణ:

న్యూస్‌మీటర్ చిత్రం ఒరిజినల్ గా ఎప్పుడు తీశారో కనుగొనడానికి రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది ఈ చిత్రం "The Tributes Paid To Former Prime Minister Rajiv Gandhi On His 71st Birth Anniversary" నాడు చిత్రీకరించబడిందని కనుగొంది. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 71వ జయంతి సందర్భంగా తీసిన ఫోటో అని తెలుస్తోంది. Getty images లో ఈ ఫోటోను మేము చూశాం. అప్పటి కార్యక్రమానికి సంబంధించిన పలు ఫోటోలను మేము చూశాం.

ఇమేజ్ డిస్క్రిప్షన్ లో "The NEW DELHI, INDIA - AUGUST 20: Congress Vice President Rahul Gandhi with his niece Miraya Vadra during a remembrance ceremony for the 71st birth anniversary of the former Indian Prime Minister Rajiv Gandhi at Veer Bhumi on August 20, 2015, in New Delhi, India. Rajiv Gandhi was assassinated during electoral campaigning, allegedly by Liberation Tigers of Tamil Eelam (LTTE) rebel separatists, in the town of Sriperumpudur, in the southern state of Tamil Nadu on May 21, 1991. (Photo by Sonu Mehta/Hindustan Times via Getty Images)" అని ఉంది. "న్యూఢిల్లీ, భారతదేశం - ఆగస్టు 20: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన మేనకోడలు మీరయా వాద్రాతో కలిసి ఆగస్టు 20, 2015న న్యూ ఢిల్లీలోని వీర్ భూమిలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 71వ జయంతి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 21, 1991న దక్షిణ తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంపుదూర్ పట్టణంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) తిరుగుబాటు వేర్పాటువాదులచే రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. (ఫోటో: సోను మెహతా/హిందుస్తాన్ టైమ్స్ గెట్టి ఇమేజెస్ ద్వారా)

డెక్కన్ క్రానికల్ ఒక కథనంలో ప్రచురించబడిన అదే చిత్రాన్ని కూడా మేము కనుగొన్నాము"Priyanka Vadra's daughter Miraya makes a rare public appearance", 21 ఆగస్టు 2015 న ఈ ఫోటోను తీశారు.

ఇది 2015లో తీసిన చిత్రమని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఈ చిత్రం చాలా పాతదని, 'భారత్ జోడో యాత్ర' కు సంబంధించినదని కాదని నిర్ధారిస్తుంది.

తమిళనాడు రాష్ట్ర ఐటీ & సోషల్ మీడియా ప్రెసిడెంట్ CTR నిర్మల్ కుమార్ చేసిన ట్వీట్‌కు తీవ్ర విమర్శలు రావడంతో.. అసలు ట్వీట్‌ను తొలగించి, తన ట్విట్టర్ ఖాతాలో క్షమాపణలు చెబుతూ ట్వీట్‌లను అప్‌లోడ్ చేశారు. తన ఉద్దేశం కేవలం వ్యంగ్యం మాత్రమేనని అన్నారు. 'My intent was just a satire by comparing Rahul with kids maturity & I stand with it. I removed it since a few fake peddlers like @zoo_bear misled my Tamil content with false information. Now I will leave it to the people's decision.' అంటూ ట్వీట్ చేశారు. కొందరు పనిగట్టుకుని తన ట్వీట్ ను తప్పుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి ఫేక్ ట్వీట్స్ ను నమ్మకండని కోరారు.


కాబట్టి, కొన్ని సంవత్సరాల కిందటి ఫోటోను తప్పుడు వదంతులతో షేర్ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

Claim Review:Old image of Rahul Gandhi shared with misleading claim amidst ‘Bharat Jodo Yatra’
Claimed By:social media users
Claim Reviewed By:Newsmeter
Claim Fact Check:Misleading
Next Story