Fact Check : పాత 100,10, 5 రూపాయల నోట్లను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటూ ఉందా..?
old currency notes of Rs 100, 10, and 5 denominations will not be withdrawn.పాత నోట్లకు సంబంధించిన వార్తలు ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.
By Medi Samrat Published on 2 Feb 2021 2:50 AM GMTనోట్లకు సంబంధించిన వార్తలు ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా పాత 100, 10, 5 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వెనక్కు తీసుకుంటూ ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలుస్తూ ఉన్నాయి. మార్చి లేదా ఏప్రిల్ 2021 కల్లా ఈ పాత నోట్లు చెల్లవంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. నోట్ల రద్దు పార్ట్-2 అంటూ సామాజిక మాధ్యమాల్లో చెప్పుకుంటూ ఉన్నారు.
Breaking : Demonetisation Part 2
— Aabid Mir Magami عابد میر ماگامی (Athlete) (@AabidMagami) January 23, 2021
Old notes of Rs 100, 10 and 5 may go out of circulation after March: RBI
ఇందుకు సంబంధించి చాలా మీడియా సంస్థలు ఇటీవల పోస్టులను పెట్టాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి.మహేష్ ఇటీవల డిస్ట్రిక్ట్ లెవెల్ కరెన్సీ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ లో మాట్లాడుతూ మార్చి-ఏప్రిల్ నెలకల్లా ప్రస్తుతం ఉన్న 100, 10, 5 రూపాయల నోట్లను రద్దు చేసే అవకాశం ఉందని చెప్పారంటూ పలు మీడియా సంస్థలు చెప్పుకొచ్చాయి.
https://siliguritimes.com/old-notes-of-rs-100-10-and-5-may-go-out-of-circulation-after-march/
Archive links: https://web.archive.org/save/
https://twitter.com/AabidMagami/status/1353007959568232448
https://web.archive.org/save/https://www.facebook.com/siliguritimes/posts/3693292697403545
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్లుగా 100, 10, 5 రూపాయల నోట్లను రద్దు చేసే ఆలోచన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు లేదంటూ ట్వీట్ చేసింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారిక ఖాతాలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఎవరు కూడా ఈ విషయాన్ని నమ్మకూడదని తెలిపారు.
With regard to reports in certain sections of media on withdrawal of old series of ₹100, ₹10 & ₹5 banknotes from circulation in near future, it is clarified that such reports are incorrect.
— ReserveBankOfIndia (@RBI) January 25, 2021
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. ఫేక్ వార్తలు అంటూ కొట్టి పడేశారు.
एक खबर में दावा किया जा रहा है कि आरबीआई द्वारा दी गई जानकारी के अनुसार मार्च 2021 के बाद 5, 10 और 100 रुपए के पुराने नोट नहीं चलेंगे।#PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। @RBI ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/WiuRd2q9V3
— PIB Fact Check (@PIBFactCheck) January 24, 2021
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా పాత వాటిని ముద్రించడం లేదని.. కేవలం కొత్త రకం 100 రూపాయలను మాత్రమే ముద్రిస్తోంది. అంతే తప్పితే పాత నోట్లు చెల్లుబాటు కావని ఎక్కడ కూడా చెప్పలేదు. 2019లో కొత్త వంద రూపాయలను తీసుకుని వచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పాత 100, 10, 5 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నామంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎక్కడా చెప్పలేదు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో నిజం లేదని పలు మీడియా సంస్థలు కూడా వెల్లడించాయి.
పాత 100, 10, 5 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నామంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినట్లుగా వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.