నది మీద పడవలు ఎంతో అందంగా ముస్తాబై.. వెలుగులు విరజిమ్ముతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో అద్భుతంగా, అందంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో విభిన్న వాదనలతో హల్ చల్ చేస్తోంది. కొంతమంది వినియోగదారులు దీనిని కేరళలో చోటు చేసుకుందని క్లెయిమ్ చేసారు, మరికొందరు ఇది శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం, మీరాలం మండి-హైదరాబాద్‌లోని దేవాలయం అని చెప్పుకొచ్చారు. పలువురు ప్రముఖులు కూడా కేరళలో దీపోత్సవంకు చెందిన వీడియో అని కూడా చెప్పారు. దీపాలతో కూడిన 240 పడవలు నదిలో ప్రయాణిస్తున్నాయని.. దీపావళి వేడుకలు కొనసాగుతున్నాయని కొందరు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. (Archive)
పోస్ట్‌ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మరో ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేసి, మీరాలం మండిలోని శ్రీ మహాంకాళేశ్వర దేవాలయంలో జరిగిన ఉత్సవాల వీడియో అని సూచించారు. (Archive)
పోస్ట్‌ని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
నిజ నిర్ధారణ:
NewsMeter రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. చైనీస్ రాష్ట్ర అనుబంధ మీడియా అయిన చైనా డైలీ అదే వీడియోను సెప్టెంబర్ 4న ట్వీట్ చేసిందని మా బృందం కనుగొంది. నదిపై డ్రాగన్ డ్యాన్స్‌ని వీడియోలో చూపించారని పేర్కొంది. చైనాలో డ్రాగన్స్ ను ఎక్కువగా ఆరాధిస్తారన్న సంగతి తెలిసిందే..!
ఈ వీడియోను చైనా ప్రభుత్వ అధికారి జాంగ్ మీఫాంగ్ సెప్టెంబర్ 4న పోస్ట్ చేశారు. నదిపై డ్రాగన్ డ్యాన్స్‌ని వీడియోలో చూపించారని కూడా చెప్పారు.
ప్రభుత్వ వెబ్‌సైట్ గ్వాంగ్జీ చైనా ప్రచురించిన కథనంలో మేము వీడియో స్క్రీన్‌షాట్‌లను కనుగొన్నాము. మే 19న, బంగారు దీపాలతో కూడిన 80 వెదురు తెప్పలు 70 మీటర్ల పొడవైన డ్రాగన్ లాంటి ఆకారాన్ని ఏర్పాటు చేసి.. యులాంగ్ నది వెంబడి తిరిగాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం 12వ చైనా టూరిజం డే రోజున నిర్వహించారు, ఇది యులాంగ్ నదికి మరింత పేరును తీసుకుని రావడానికి, నైట్ టూరిజంను అభివృద్ధి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు.
Xi's Moments, CGTN వంటి చైనీస్ స్టేట్ మీడియా ధృవీకరించబడిన Facebook పేజీలలో పోస్ట్ చేసిన వీడియోలను కూడా మేము కనుగొన్నాము.
ఆ వీడియో చైనాకు చెందినదని స్పష్టమైంది. కాబట్టి, ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ వైరల్ వీడియోకు తెలంగాణకు, కేరళకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తోంది.