FactCheck : ఈ వైరల్ వీడియో హైదరాబాద్ చర్చిలో జరిగిన గొడవ, రాజమండ్రి లో కాదు

No, This Incident Took Place In Hyderabad Lutheran Church But Not In Rajahmundry. రాజమండ్రి చర్చి గేటు వద్ద, జాంపేట లోదరన్ చర్చ్ లో, ది 29 1 2023 ఆదివారం చర్చిలో

By Nellutla Kavitha  Published on  7 Feb 2023 9:09 AM GMT
FactCheck : ఈ వైరల్ వీడియో హైదరాబాద్ చర్చిలో జరిగిన గొడవ, రాజమండ్రి లో కాదు

“రాజమండ్రి చర్చి గేటు వద్ద, జాంపేట లోదరన్ చర్చ్ లో, ది 29 1 2023 ఆదివారం చర్చిలో వచ్చిన కానుకలలో, వారి వాటా దశమ భాగాల కోసం కొట్టుకుంటున్న చర్చి పాస్టర్లు" అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది.

ఫేస్బుక్ లో దీన్ని వైరల్ గా సర్క్యులేట్ చేస్తున్నారు కొంతమంది నిటిజన్లు.

ఇక ఇదే వీడియో మరి కొంతమంది నెటిజెన్లు ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు.

ఇంగ్లీషులో పోస్ట్ చేసిన ఈ వీడియోను ట్విట్టర్లో ఇక్కడ కూడా చూడవచ్చు

నిజ నిర్ధారణ :

వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియో ను ఫ్యాక్ట్ చెక్ చేసి చూసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఫేస్బుక్ లో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియో కింద కామెంట్లను గమనించినప్పుడు ఈ సంఘటన జరిగింది రాజమండ్రిలో కాదని హైదరాబాదులో అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. గొడవ జరగడానికి గల కారణాలను కూడా అందులో వివరించారు ఆ కామెంట్లను ఇక్కడ చూడవచ్చు.



దీంతో హైదరాబాద్ లూథరన్ చర్చ్ పేరుతో సెర్చ్ చేసి చూసి చూసింది న్యూస్ మీటర్. తెలుగు మెయిన్ సర్వీస్ అనే డిస్క్రిప్షన్ తో లక్డీకాపూల్ లూధరన్ చర్చ్ లో జరిగిన ప్రేయర్స్ కి సంబంధించి, యూట్యూబ్ లో జనవరి 29, 2023 న ఒక వీడియోను గమనించవచ్చు. 12 నిమిషాల 41 సెకండ్ లో ఉన్న ఈ వీడియోలో కూడా పాస్టర్లు గొడవ పడుతున్నట్టుగా కింద కామెంట్లని బట్టి అర్థం చేసుకోవచ్చు


యూట్యూబ్లో అన్ లిస్టెడ్ గా పబ్లిష్ అయిన ఈ వీడియోలో ఉన్న పరిసరాలు, సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయిన వీడియోలోని పరిసరాలు ఒకటిగా మనం గమనించవచ్చు.


ఇక ఆంధ్ర ప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా ఈ వీడియోకి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ చేసింది. అయితే ప్రస్తుతం వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న వీడియో 2019 నాటిదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ట్విట్టర్లో పేర్కొంది.

అర్హత లేని పాస్టర్లు ప్రేయర్ చేస్తున్నారంటూ చర్చిలో జరిగిన గొడవను ఒక నెటిజన్ ఏప్రిల్ 14, 2019 న ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు. ఇదే వీడియోను ఏపీ ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ట్వీట్ చేసింది.

ఆసక్తికరంగా ఇదే వీడియోలోని ఒక ఫోటో తీసుకుని, ఈ సంఘటన ఆఫ్రికాలోని ఒక గ్రామంలో జరిగినట్టుగా జాంబియన్ అబ్జర్వర్ ఒక వార్తను ప్రచురించింది.

ఈ వార్త ఆధారంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు కొంతమంది నెటిజెన్లు

2019 లో ఫేస్బుక్ లో, తెలుగులో మాట్లాడుతున్న వీడియోని స్క్రీన్ షాట్ తీసి, జాంబియన్ అబ్జర్వర్ ప్రచురించిన ఫోటోని ఇక్కడ చూడవచ్చు.



ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ విభాగం కొన్ని వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేసినప్పటికీ, ప్రస్తుతం వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న వీడియో ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినది అంటూ షేర్ చేస్తున్నారని చెప్పింది. అయితే అది ఎక్కడిదో మాత్రం స్పష్టం చేయలేదు.

ఇక ప్రస్తుతం వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న వీడియోను గమనించినప్పుడు, సండే ప్రేయర్ ఎవరు చేయాలి అనేదానిపై ఏర్పడిన వివాదంగా అర్థం చేసుకోవచ్చు. వీడియో కింద కామెంట్స్ ని బట్టి పాస్టర్ మోసెస్ కి ఇతర పాస్టర్లకి మధ్య, ఆరాధనకు ఎవరు అర్హులు అనే అంశం మీద వివాదం తలెత్తిందని తెలుస్తోంది.

ఇక హైదరాబాద్ లకిడికాపూల్ లోని లూథరన్ చర్చ్ లో జరిగిన ఈ వివాదాన్ని రాజమండ్రిలో జరిగిన వివాదంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు.


Claim Review:ఈ వైరల్ వీడియో హైదరాబాద్ చర్చిలో జరిగిన గొడవ, రాజమండ్రి లో కాదు
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story