Fact Check : బళ్లారి భారత్ జోడో యాత్రలో జన సునామీ కనిపించిందా.?

No, these photos are not from Congress party's Ballari rally. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రకు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో

By Nellutla Kavitha
Published on : 17 Oct 2022 7:37 PM IST

Fact Check : బళ్లారి భారత్ జోడో యాత్రలో జన సునామీ కనిపించిందా.?
రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రకు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనుక నిజమెంతో తెలుసుకుందాం.

నిజ నిర్ధార‌ణ‌

మొదటగా న్యూస్ మీటర్ ఫ్యాక్ట్ చెక్ టీం కీ వర్డ్ సెర్చ్ చేసి చూసింది.

కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ బళ్ళారి ర్యాలీ కి సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో షేర్ చేశారు. కానీ వైరల్ ఇమేజ్ అందులో కనిపించలేదు.

దీంతో ఫాక్ట్ చెక్ టీం వైరల్ అవుతున్న ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసింది.

క్రైస్తవ మత ప్రచారాలు చేసే ఒక మత ప్రబోధకుడు Reinhard Bonnke కి చెందిన వెబ్ సైట్ ఇది. ఆఫ్రికాలో సభ నిర్వహించినట్టుగా ఒక ఫోటో తన ఫేస్బుక్ పేజీలో 20 జులై 2020లో పబ్లిష్ చేశారు.

ఇక ఇదే ఫోటో Reinhard bonnke crusade పేరుతో వెబ్సైట్లో కూడా 20 జనవరి, 2015లో పోస్ట్ అయ్యింది.


కీ వర్డ్ సెర్చ్ తో పాటుగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసినప్పుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించి బళ్లారికి చెందినదిగా చెప్తున్న వైరల్ ఇమేజ్ క్లెయిమ్ తప్పు.


Claim Review:బళ్లారి భారత్ జోడో యాత్రలో జన సునామీ కనిపించిందా.?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story