FactCheck : మంగళూరులో బంగారు నాణాలతో ఉన్న కలశం దొరికిందా?
No, the viral video from Mangalore is fictional. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో బంగారు నాణాలతో ఉన్న ఒక పురాతన కలశం దొరికిందని
By Nellutla Kavitha Published on 26 Oct 2022 2:01 PM ISTకర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో బంగారు నాణాలతో ఉన్న ఒక పురాతన కలశం దొరికిందని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయింది.
https://www.facebook.com/100000240638567/videos/428806685992680/
సెంట్రల్ మార్కెట్ ఉన్న పాత భవనాన్ని కూల్చివేసి, కొత్త భవన నిర్మాణం కోసం జరుగుతున్న తవ్వకాల్లో ఒక పురాతన కలశం బయటపడిందని, ఆ కలశాన్ని తెరిచినప్పుడు అందులో సజీవంగా ఉన్న ఒక పాముతో పాటుగా కొన్ని బంగారు నాణాలు, ఒక గోల్డ్ చైన్ కూడా బయటపడిందని సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు సర్క్యులేట్ చేశారు.
అయితే వైరల్ అయిన ఈ వీడియోలో నిజం ఎంత?
నిజనిర్ధారణ :
ఫాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. గూగుల్ కీవర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు హిందూ పేపర్ లో వచ్చిన ఒక ఆర్టికల్ కనిపించింది. సెంట్రల్ మార్కెట్ భవనాన్ని కూల్చి వేసే పనులు ప్రారంభమయ్యాయని వార్త అందులో ఉంది. కానీ అందులో ఎక్కడా పురాతన కలశం దొరికిందని గానీ, అందులో బంగారు నాణాల గురించిన వార్త లేదు.
దీంతో మరోసారి వైరల్గా సర్క్యులేట్ అయిన ఫేస్బుక్ వీడియోని పరిశీలించింది న్యూస్ మీటర్ టీం. నెటిజన్లు షేర్ చేసిన డిస్క్రిప్షన్ కింద ఒక లింక్ కనిపించింది. Watch more original videos by: Hazine avcısı. దాన్ని క్లిక్ చేసినప్పుడు 692,239 మంది ఫాలోవర్స్ లతో ఉన్న @expertarchaeologist అనే ఒక ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అయింది.
ఇక ఇదే పేరుతో మూడు లక్షల అరవై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇక ఇదే వీడియో మరో పేరు తో guardian snake of the great treasure అవి అక్టోబర్ 24 వ తారీకున ఫేస్బుక్లో తిరిగి అప్లోడ్ చేశారు.
మే21, 2022న యూట్యూబ్లో అప్లోడ్ చేసిన మరొక వీడియోలో మంగళూరులో దొరికిందని చెబుతున్న అదే కలశం కనిపించింది. అందులో కూడా పాముతో పాటుగా కొన్ని బంగారు నాణాలు దొరికాయి.
మరోవైపు మంగళూరులో దొరికినట్టుగా చెపుతున్న కలశంలో ఉన్న గోల్డ్ చైన్ ఇంకొక రెండు వీడియోల్లో కూడా కనిపించింది. ఆ రెండు వీడియోలు వేర్వేరు ప్రాంతాల్లో తవ్వి తీసిన నిధులుగా వీడియో డిస్క్రిప్షన్ లో వెల్లడించారు. I found real treasure in the cave I entered with the metal detector అన్న ఈ 5:50 సెకండ్లు ఉన్న ఈ వీడియోలో ఉన్న గోల్డ్ చైన్ (4:09 Seconds) మంగళూరులో ఉన్న గోల్డ్ చైన్ ఒకటే.
అక్టోబర్ 13న పబ్లిష్ చేసిన I found the treasure of the sign of the cross ఈ వీడియోలో కూడా అదే బంగారు గొలుసు క్లియర్ గా కనిపిస్తుంది.
టర్కీకి చెందిన కంటెంట్ క్రియేటర్ Hazine avcisi ఫేస్బుక్, యూట్యూబ్ లను రన్ చేస్తున్నారు. if you like our treasure videos please subscribe అన్నీ యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంగ్లీష్, టర్కిష్, జార్జియన్ భాషల్లో డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. జార్జియన్ భాషలో ఉన్న టెక్స్ట్ ను ట్రాన్స్లేట్ చేసి చూస్తే…అదంతా నిజం కాదని, ఫిక్షనల్ వీడియోలు మాత్రమేనని, ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి రూపొందించినవని ఉంది.
Hazine avcısı రూపొందిస్తున్న వీడియోలన్నీ ఫిక్షనల్ మాత్రమే. నిజమైనవి కాదు. అంటే మంగళూరులో దొరికినదిగా చెప్తున్న కలశం, బంగారు నాణాల క్లైమ్ కూడా తప్పు.