హారతి ఇవ్వడానికి రాహుల్ గాంధీ నిరాకరించారనే వాదనతో ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న దుర్గాపూజ ఉత్సవాల సందర్భంగా వైరల్‌గా మారింది ఈ వీడియో.
వీడియోలో, రాహుల్ గాంధీ దుర్గా పూజ హారతి ఇస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య నిలబడి ఉన్నారు.
"రాహుల్ గాంధీ హారతి తీసుకోవడానికి, పూజలు చేయడానికి నిరాకరించారు.. అతను ఏ వర్గానికి చెందినవాడో మళ్లీ నిరూపించుకున్నాడు" అని వీడియోను షేర్ చేస్తున్నారు ట్విట్టర్ వినియోగదారులు.
పోస్ట్‌ను వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అదే క్లెయిమ్ చేస్తూ పలువురు వినియోగదారులు వీడియోను షేర్ చేశారు. (పోస్ట్‌లను వీక్షించడానికి ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.)
నిజ నిర్ధారణ:
NewsMeter బృందం.. వీడియో కీఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. ఇండియా టుడే జర్నలిస్ట్ సుప్రియా భరద్వాజ్ 27 సెప్టెంబర్ 2017న ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోను మేము కనుగొన్నాం.
ఈ వీడియోలో, రాహుల్ గాంధీ ప్రారంభంలోనే హారతి ఇవ్వడం చూడవచ్చు. పక్కనే అశోక్ గెహ్లాట్ కూడా ఉన్నారు. ఒరిజినల్ వీడియో నుండి క్లిప్ ను ఎడిట్ చేశారు. రాజ్‌కోట్‌లోని గర్బా పండల్‌లో రాహుల్ గాంధీ పూజలు చేశారని సుప్రియా భరద్వాజ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ 7 సెప్టెంబర్ 2017న జరిగిన పూజా కార్యక్రమాలకు సంబంధించింది. "The day ends well with Garba in Rajkot." అంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కూడా ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేసింది.
రాహుల్ గాంధీ హారతి ఇవ్వడానికి నిరాకరించారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.