స్టేడియంలో జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోని వీడియో అని ప్రచారం జరుగుతోంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది.
"హైదరాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ప్రేక్షకులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తున్నారు'' అని ఓ ట్విటర్ యూజర్ వీడియోను షేర్ చేశారు.
పోస్ట్‌లను వీక్షించడానికి ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్‌లో కూడా ఇలాంటి వాదనలు వినిపిస్తున్నాయి.
నిజ నిర్ధారణ:
NewsMeter బృందం ట్విటర్‌లో కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. సెప్టెంబరు 23న నాగ్‌పూర్‌లో జరిగిన రెండవ T20 మ్యాచ్‌లోని వీడియో అని వినియోగదారు తెలిపిన ఒక ట్వీట్ కనుగొనబడింది.
వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే వీడియో సెప్టెంబర్ 24న ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడినట్లు మేము కనుగొన్నాము. నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటాయని పోస్టుల్లో తెలిపారు.
వైరల్ వీడియోకు ఆడియో డిజిటల్‌గా జోడించబడిందా లేదా నాగ్‌పూర్‌లో జరిగిన రెండవ T20 మ్యాచ్‌లో 'జై శ్రీరామ్' నినాదాలు లేవనెత్తారా అనేది మేము ధృవీకరించలేకపోయాము.
భారత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లో జరిగింది. సెప్టెంబర్ 24న ఒక వినియోగదారు పోస్ట్ చేసిన వైరల్ వీడియోను మేము కనుగొన్నాము. దీన్ని బట్టి, వైరల్ వీడియో హైదరాబాద్ మ్యాచ్‌లోనిది కాదని మేము నిర్ధారించగలము.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.