జగిత్యాల జిల్లా, రాయికల్ మండలంలో ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ వరద ప్రభావిత ప్రాంతాలకు రిపోర్టింగ్ కోసం వెళ్లి వస్తూ, వెహికల్ తో సహా వరద నీటిలో కొట్టుకుపోయారు. ఈ వార్తకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అయింది.
నిజనిర్ధారణ :
అయితే అది ప్రస్తుత వీడియో కాదని, పాత వీడియో అని, ఇప్పుడు వైరల్ గా మారిందని న్యూస్ మీటర్ ఫ్యాక్ట్ చెక్ టీం తేల్చింది.
రిపోర్టర్ జమీర్ వాహనంతో సహా కొట్టుకుపోయారు అని చెప్తున్న 30 సెకన్ల వీడియోను పరిశీలించి చూస్తే వీడియో చివరలో ఉర్దూలో మాట్లాడడం స్పష్టంగా వినిపిస్తుంది. దీంతోపాటుగా ఆ వాహనం నెంబర్ ప్లేట్ కూడా BE ఈ 9119 గా కనిపిస్తుంది. వాహనం వెనక ఉన్న stepney టైర్ కి సుజుకి సింబల్ తో పాటుగా ఫోటో పోటోహర్ అని స్పష్టంగా రాసి ఉంది.
దీంతో గూగుల్ సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ ఫ్యాక్ట్ చెక్ టీం. అలాగే సంబంధిత వీడియో కి చెందిన వీడియో అనాలసిస్ తో పాటుగా కీ ఫ్రేమ్ సెర్చ్ చేసి చూసింది. ఈ వెహికల్ పాకిస్థాన్ కు చెందిన సుజుకి ఫోటోహర్ వాహనంగా నిర్ధారణకు వచ్చింది న్యూ ఫ్యాక్ట్ చెక్ టీం. ఇక ఇతర టూల్స్ తో నిర్ధారణ చేసి చూసినప్పుడు ఈ వీడియోను పాకిస్తాన్ కు చెందిన ఒక వ్యక్తి 2020 సెప్టెంబర్ 4న యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లు గా కనిపించింది.
అంటే జగిత్యాల జిల్లా రాయికల్ లో వరదలో కొట్టుకుపోయినట్టుగా ప్రచారం జరుగుతున్న ఈ వీడియో ఇప్పటిది కాదు. ఇది ఫాల్స్ క్లెయిమ్. జమీర్ సురక్షితంగా రావాలని అందరమూ కోరుకుందాం.