FactCheck : వైరల్ వీడియోలో ఉన్నది హీరో మహేష్ బాబా?!

No, Hero Mahesh Babu Is Not Seen In The Viral Video. పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వచ్చిన మహేష్ బాబు అంటూ ఒక వీడియో

By Nellutla Kavitha  Published on  21 Nov 2022 7:47 PM IST
FactCheck : వైరల్ వీడియోలో ఉన్నది హీరో మహేష్ బాబా?!

దివికేగిన సూపర్ స్టార్ కృష్ణ,

పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వచ్చిన మహేష్ బాబు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది.

సూపర్ స్టార్ కృష్ణ కండిషన్ తెలిసిన తర్వాత హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వస్తున్న వీడియో ఉంటూ కొంతమంది నెటిజన్లు దానిని వైరల్గా సర్క్యులేట్ చేశారు.


https://www.facebook.com/reel/5589868854428412/?s=single_unit


నిజ నిర్ధారణ :

అయితే అందులో నిజం ఎంత ఎంత ఫాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం.

వైరల్ గా సర్క్యులేట్ అయిన వీడియో కింద కామెంట్స్ లో కొంతమంది నెటిజన్లు ఆ వీడియోలో కనిపిస్తున్నది మహేష్ బాబు కాదని అతని మేనల్లుడు అశోక్ గల్లా అంటూ కామెంట్ చేశారు.



దీంతోపాటుగానే ఆ వీడియోని అబ్జర్వ్ చేసినప్పుడు క్లియర్ గా నడిచి వస్తున్నది హీరో అశోక్ గల్లా అనే మాటలు కూడా వినిపించాయి.

దీంతో కీవర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు ఒక వీడియో యూట్యూబ్ లో కనిపించింది. అశోక్ గల్లా ఎమోషనల్ వీడియో పేరుతో ఒక నిమిషం 5 సెకన్లు ఉన్న ఈ వీడియోలో అశోక్ గల్లా హాస్పిటల్ లో కి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.

https://www.youtube.com/watch?v=7pW6qNmMfNM


యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూసినప్పుడు మహేష్ బాబు హాస్పిటల్ కి వెళ్ళిన ఒక వీడియోలోని దృశ్యాలు కూడా కనిపించాయి.

https://youtu.be/LXUN51SPQRg


ఇక అశోక్ గల్లా, మహేష్ బాబుకి మేనల్లుడు, ఎంపీ జయదేవ్ గల్లా కుమారుడు అశోక్. అశోక్ గల్లా కూడా సినిమా నటుడే. అశోక్ నటించిన మొదటి సినిమా "హీరో" 2022 లో విడుదలైంది.

https://en.wikipedia.org/wiki/Hero_(2022_film)

హీరో సినిమాకి సంబంధించిన ఈ విషయాలన్నీ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసుకున్నాడు అశోక్ గల్లా. తన మామయ్య అయిన మహేష్ బాబు వీడియోని అదే హ్యాండిల్ షేర్ చేసుకున్నాడు.

https://twitter.com/AshokGalla_/with_replies?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor

సో, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో నిజం కాదు. పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వచ్చింది మహేష్ బాబు కాదు, అతని మేనల్లుడు అశోక్ గల్లా


Claim Review:వైరల్ వీడియోలో ఉన్నది హీరో మహేష్ బాబా?!
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story