FactCheck : సముద్రంలో దొరికిన కంటైనర్ లో ఐఫోన్లు దొరికాయా ?
No, Floating Cargo Container Was Not Carrying IPhones. బ్రెజిల్ లోని సముద్రంలో నీళ్లలో తేలుతూ వెళ్తున్న కంటైనర్ లో ఐఫోన్లు దొరికాయని ఒక వీడియో సోషల్ మీడియాలో
బ్రెజిల్ లోని సముద్రంలో నీళ్లలో తేలుతూ వెళ్తున్న కంటైనర్ లో ఐఫోన్లు దొరికాయని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. కంటైనర్ ను ఓపెన్ చేసి చూస్తే లక్షలు విలువ చేసే ఐ ఫోన్ లు ఉన్నాయని ఆ వీడియో సారాంశం.
వైరల్ గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఈ వీడియోలో నిజం ఎంత?
ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. కీవర్డ్ సెర్చ్ తో పాటుగా కీ ఫ్రేమ్ అనాలసిస్ చేసినప్పుడు యూట్యూబ్ లో దీనికి సంబంధించిన పాత వీడియో ఒకటి బయటపడింది. ఆగస్టు 18, 2021 న 13.38 నిమిషాల నిడివిగల ఒక వీడియో Denis Mikhailenko అనే యూట్యూబ్ చానల్ లో కనిపించింది.
ఈ వీడియోలో 5:35 నుంచి 6:18 నిమిషాల వరకు గమనిస్తే అండ్ D & B అనే ఒక టుబాకో బ్రాండ్ ఉన్న అట్టపెట్టెలు కనిపిస్తాయి. వాటి మీద చాలా స్పష్టంగా First Quality Tobacco Deluxe Filter అని రాసి ఉంది.
ఈ టొబాకో బ్రాండ్ కోసం గూగుల్ సెర్చ్ చేసినప్పుడు మాకు ఇదే సింబల్ తో ఉన్న కొన్ని ఇమేజెస్ కనిపించాయి.
అయితే సిగరెట్ పెట్టెలతో ఉన్న కంటైనర్ ఏదైనా సముద్రంలో మునిగిపోయిందా అనే వార్త తెలుసుకోవడానికి మరోసారి గూగుల్ అడ్వాన్స్ కీవర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు రెండు ఆర్టికల్స్ కనిపించాయి. ఈ సంఘటనకు సంబంధించిన రెండు ఆర్టికల్స్ 29 సెప్టెంబర్, 2020 పబ్లిష్ అయ్యాయి
అయితే కంటెయినర్లలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఐ ఫోన్లు సముద్రంలో మునిగి పోయినట్లుగా ఎలాంటి వార్త మాకు కనిపించలేదు. దీనితో పాటుగా ఆపిల్ సంస్థకి సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు.
సో, బ్రెజిల్ సముద్ర నీళ్లలో తేలుతూ వెళ్తున్న కంటైనర్ లో ఐఫోన్లు దొరికాయి అన్న వీడియో నిజం కాదు.
Claim Review:సముద్రంలో దొరికిన కంటైనర్ లో ఐఫోన్లు దొరికాయా ?