గోధుమ రైతులకు కేంద్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించిందని ఏబీపీ న్యూస్ బులెటిన్ కు సంబంధించిన స్క్రీన్ గ్రాబ్ వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. స్క్రీన్ షాట్ లో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చిత్రం ఉంది. గోధుమ రైతులకు క్వింటాల్‌కు రూ.525 బోనస్‌గా లభిస్తుందని అందులో పేర్కొన్నారు. తక్కువ గోధుమ ఉత్పత్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా పేర్కొంది.
నిజ నిర్ధారణ :
NewsMeter ఈ వైరల్ పోస్టులకు మద్దతు ఇచ్చే నివేదికలను కనుగొనలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లయితే, వార్తా సంస్థలు కూడా అందుకు సంబంధించిన కథనాలను ప్రసారం చేసేవి. అలాగే, ABP న్యూస్ వెబ్‌సైట్ లేదా దాని YouTube ఛానెల్‌లో మాకు అలాంటి నివేదికలు ఏవీ కనిపించలేదు. కాబట్టి వైరల్ పోస్టులకు బలమైన సాక్ష్యాలు ఎక్కడా కనిపించలేదు. కీ వర్డ్స్ సెర్చ్ చేసినప్పటికీ ఎటువంటి మీడియా ప్రకటనలు కనిపించలేదు.
16 మార్చి 2022న "అనాజ్ మండి ఎక్స్‌పర్ట్" Anaj Mandi Expert ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడిన YouTube వీడియో నుండి స్క్రీన్‌గ్రాబ్ తీసుకోబడింది. ఈ వీడియో బోనస్ గురించి వార్తలు రాసింది కానీ.. ఈ బోనస్‌ను పొందే ప్రక్రియ గురించి ఎటువంటి మూలాధారాలను ఉదహరించలేదు లేదా తెలియజేయలేదు.
సెప్టెంబర్ 2021లో, ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రబీ పంటల కనీస మద్దతు ధర (MSP)ని 2.03% పెంచింది. 2021-22లో క్వింటాల్‌కు రూ. 1,975 నుండి ఎంఎస్‌పి 2022-23 సంవత్సరానికి క్వింటాల్‌కు 2,015 రూపాయలు పెరిగింది.
కేంద్రం మాత్రం బోనస్‌గా రైతులకు క్వింటాలుకు రూ.525 ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. వైరల్ స్క్రీన్‌గ్రాబ్ ఎడిట్ చేయబడింది. కాబట్టి, వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.