Factcheck: 2024 ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో YSRCP మెజారిటీ వస్తుందని News18 అభిప్రాయ సేకరణ ద్వారా తెలిసిందా?

ఏపీలో లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ సాధిస్తుందని.. న్యూస్18 నిర్వహించిన అభిప్రాయ సేకరణ ఫలితాలు వైరల్‌ అయ్యాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 March 2024 8:52 PM IST
opinion poll,   ysrcp,  andhra pradesh, lok sabha,

Factcheck: 2024 ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో YSRCP మెజారిటీ వస్తుందని News18 అభిప్రాయ సేకరణ ద్వారా తెలిసిందా?

ఆంద్రప్రదేశ్‌లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి మెజారిటీ విజయాన్ని సాధిస్తుందని.. న్యూస్18 నిర్వహించిన అభిప్రాయ సేకరణ ఫలితాలు వైరల్‌గా మారాయి. "న్యూస్18 మెగా ఒపీనియన్ పోల్ వైరల్ స్క్రీన్ షాట్ మొత్తం ఓట్లలో 50 శాతంతో YSRCP విజేతగా అంచనా వేయగా, NDAకి 41 శాతం ఓట్ షేర్ వచ్చింది." అని అందులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీ (జెఎస్‌పి), భారతీయ జనతా పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

"రాబోయే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 50% ఓట్లతో YSRCP మరోసారి క్లీన్ స్వీప్ చేయబోతోంది" అనే శీర్షికతో ఒక ఫేస్‌బుక్ వినియోగదారు సర్వేకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు. (Archive)

నిజ నిర్ధారణ:

వైరల్ స్క్రీన్ షాట్ వైసీపీకి కాకుండా NDAకి మెజారిటీ ఓట్ షేర్‌ని అందించిన అసలు News18 ఒపీనియన్ పోల్ ద్వారా ఎడిట్ చేశారని NewsMeter కనుగొంది.

వైరల్ ఇమేజ్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం ద్వారా.. న్యూస్18 యూట్యూబ్ ఛానెల్‌లో ‘Mega Opinion Poll: Election Showdown: Modi vs. Rahul! Who Will Win India's Heart? News18 LIVE’ అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు. ‘మెగా ఒపీనియన్ పోల్: ఎలక్షన్ షోడౌన్: మోదీ వర్సెస్ రాహుల్! భారతదేశ హృదయాన్ని ఎవరు గెలుచుకుంటారు? న్యూస్18 లైవ్' అని అందులో ఉంది. మార్చి 14, 2024న ప్రచురించారు.

వీడియోలో 9:11:10 టైమ్‌స్టాంప్ వద్ద, న్యూస్18 న్యూస్ టీమ్ APలో ప్రధాన పార్టీలకు వచ్చే ఓట్ షేర్‌ను అంచనా వేశారు. అందులో NDAకి 50 శాతం ఓట్లు.. YSRCPకి 41 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. అసలు వీడియోలో, YSRCP పేరు మొదటి లైన్‌లో ప్రదర్శించారు.. అయితే వైరల్ స్క్రీన్‌షాట్‌లో.. రెండవ లైన్‌లో కనిపించింది. పేర్లను ఎడిట్ చేయడం ద్వారా వైరల్ స్క్రీన్‌షాట్ ను ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

రెండు స్క్రీన్‌షాట్‌ల మధ్య పోలిక ఇక్కడ చూడవచ్చు.

మెగా ఒపీనియన్ పోల్ ప్రకారం, మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఏ కూటమి 411 సీట్లు గెలుస్తుందని అంచనా వేయగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 105 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. ఇతర పార్టీలు 27 సీట్లు గెలుచుకుంటాయని అందులో తెలిపారు. ఈ ఫలితాలు News18 YouTube ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

కాబట్టి, 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో YSRCPకి మెజారిటీ ఓట్ షేర్‌ వస్తుందని న్యూస్18 ఒపీనియన్ పోల్‌ని చూపించే స్క్రీన్‌షాట్ ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని మేము నిర్ధారించాము.

Claim Review: 2024 ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో YSRCP మెజారిటీ వస్తుందని News18 అభిప్రాయ సేకరణ ద్వారా తెలిసిందా?

elections 2024 released by News18.

Claimed By:X and Facebook users

Claim Reviewed By:NewsMeter

Claim Source:Facebook

Claim Fact Check:False

Next Story