మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి నడుచుకుంటూ వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. వైరల్ వీడియోలో శివరాజ్ సింగ్ చౌహన్, ప్రధాని మోదీతో కలిసి నడుస్తున్నట్లు కనిపించారు. అయితే ఆయన అకస్మాత్తుగా ఆగిపోయారు. కొంత సమయం తర్వాత ఆయన మళ్ళీ ముందుకు వెళ్లారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు నడవకుండా ప్రధాని సిబ్బంది ఒకరు అడ్డుకున్నారని సోషల్ మీడియా వినియోగదారులు పోస్టులు పెడుతూ ఉన్నారు.
Indian National Congress of Madhya Pradesh అనే ఫేస్ బుక్ పేజీలో నవంబర్ 17, 2021న ఈ వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
NewsMeter గూగుల్ రివర్స్ సెర్చ్ చేయగా.. నవంబర్ 17, 2021న శివరాజ్ కార్యాలయం యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక ట్వీట్‌కు దారితీసింది. ట్విట్టర్ హ్యాండిల్ లోని వీడియో క్లిప్ వైరల్ పోస్టులకు పూర్తీ వివరణ ఇవ్వగలదు.
ప్రధాని మోదీ సిబ్బందిగా చెప్పుకుంటున్న వ్యక్తి నిజానికి భోపాల్ కలెక్టర్ అవినాష్ లావానియా. అవినాష్ ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించడానికి శివరాజ్ సింగ్ వద్దకు వెళ్ళారని వివరణ ఇచ్చారు.
ఈ వార్తను క్లూగా తీసుకొని మా టీమ్ కీవర్డ్ సెర్చ్ చేసింది. ఇది నవంబర్ 17, 2021 న భోపాల్ కలెక్టర్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్‌కు మమ్మల్ని దారితీసింది. ట్వీట్‌లో, భోపాల్ కలెక్టర్ "ఒక వీడియో వైరల్ అవుతోంది" అని పేర్కొంటూ వైరల్ పోస్టులను ఖండించారు. భోపాల్‌లో ప్రధాని పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రిని భద్రతా అధికారి ఒకరు అడ్డుకున్నారని సోషల్ మీడియాలో పేర్కొంటున్న పోస్టులను పూర్తిగా ఖండిస్తున్నానని భోపాల్ కలెక్టర్ తెలిపారు.
మరో ట్వీట్‌లో, కార్యక్రమానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సందేశాన్ని తాను ముఖ్యమంత్రికి పంచుకోవాల్సి ఉందని, దాని కోసం తాను చెప్పడానికి ప్రయత్నించానని.. విన్న వెంటనే ఆయన ముందుకు సాగారని కలెక్టర్ పేర్కొన్నారు.
మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ప్రధాని భద్రతా సిబ్బంది అడ్డుకుందన్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. కాబట్టి వైరల్ పోస్టులు ప్రజలను తప్పుద్రోవ పట్టించే విధంగా ఉన్నాయి.