కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పుస్తకాన్ని చదువుతున్న ఫొటో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. పుస్తకం కవర్‌పై రాహుల్ గాంధీ ఫోటో ఉంది. "రాహుల్ గాంధీ డే-టు-డే షెడ్యూల్ 2022-2023" అనే శీర్షిక ఉంది.
పోస్ట్‌లను చూడటానికి ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ అండ్ ఇక్కడ క్లిక్ చేయండి.
నిజ నిర్ధారణ:
NewsMeter బృందం వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. స్మృతి ఇరానీ అసలు ఫోటోను 18 సెప్టెంబర్ 2022న ట్వీట్ చేసిందని గుర్తించాం. ఈ ఫోటోలో, స్మృతి ఇరానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో ఉన్న పుస్తకాన్ని చదువుతున్నారు. "Modi@20" అని ఉన్న బుక్ ను ఇరానీ చదువుతూ ఉన్నారు. వైరల్ ఫోటోను మార్ఫింగ్ చేసినట్లు గుర్తించాం.
"మోడీ@20" పుస్తకం శ్రీ మోదీ 20 ఏళ్ల రాజకీయ ప్రయాణం గురించి ఉంది. హోం మంత్రి అమిత్ షా నుండి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వరకు మొత్తం 22 మంది వ్యక్తులు సహ-రచయితలు మారి 21 అధ్యాయాలు ఉన్న పుస్తకం.
ఇరానీ సెప్టెంబరు 18న బీహార్‌లోని పాట్నాలో భారతీయ జనతా పార్టీ (BJP) బీహార్ ఇన్‌ఛార్జ్ వినోద్ తావ్డేతో కలిసి పుస్తకం హిందీ వెర్షన్‌ను ఆవిష్కరించారు.
రాహుల్ గాంధీపై పుస్తకాన్ని చదువుతున్న స్మృతి ఇరానీ అంటూ వైరల్ అవుతున్న ఫొటోలో ఎటువంటి నిజం లేదు. వైరల్ ఫోటో మార్ఫింగ్ చేసినట్లు స్పష్టమైంది. కాబట్టి, వైరల్ అవుతున్న ఫోటోలో ఎటువంటి నిజం లేదు.