FactCheck : భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ లో అభిమాని బాబర్ ఆజమ్ ను పొగుడుతూ ప్లకార్డు పట్టుకున్నాడా?

Morphed photo shows fan supporting Pak’s Babar Azam during recent Ind–NZ match. పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజామ్‌కు మద్దతుగా ఓ వ్యక్తి ప్లకార్డు పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Feb 2023 3:15 PM GMT
FactCheck : భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ లో అభిమాని బాబర్ ఆజమ్ ను పొగుడుతూ ప్లకార్డు పట్టుకున్నాడా?

పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజామ్‌కు మద్దతుగా ఓ వ్యక్తి ప్లకార్డు పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్లకార్డుపై ఉన్న టెక్స్ట్ లో “క్షమించండి విరాట్ సార్, నాకు క్రికెట్ దేవుడు బాబర్ ఆజం" (“Sorry Virat sir but Babar Azam is the god of cricket for me…. #77.”) అని ఉంది.


రాంచీలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లోని ఫోటో అని ట్విట్టర్ వినియోగదారులు చెబుతూ వస్తున్నారు.

ఈ ఫోటో ఫేస్‌బుక్‌లో కూడా చక్కర్లు కొడుతోంది.

జనవరి 27న రాంచీలో జరిగిన టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించిన తర్వాత ఇది వైరల్ అవుతోంది. జనవరి 29న జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌ను సమం చేసింది.

నిజ నిర్ధారణ :

న్యూస్‌మీటర్ ఫోటో మార్ఫింగ్ చేసినట్లు గుర్తించింది.

వైరల్ పోస్ట్‌లలో ఒకదానిపై వ్యాఖ్యానిస్తున్న ఒక వినియోగదారు అసలు ఫోటోను ట్వీట్ చేశారు, అదే వ్యక్తి అదే వేషధారణలో ఉన్న ప్లకార్డ్‌ను పట్టుకుని, “క్షమించండి సచిన్ సార్.. M.S. ధోనీ నాకు క్రికెట్ దేవుడు... #7." (“Sorry Sachin sir but M.S. Dhoni is the god of cricket for me…. #7.”) అని ఉంది.

బాబర్ ఆజం జెర్సీ నంబర్ 56.. M.S. ధోనీ ఒకప్పుడు జెర్సీ నంబర్ 7ను ధరించేవారు. ప్లకార్డ్‌పై ఉన్న జెర్సీ నంబర్ 7, ఇది వైరల్ ప్లకార్డ్ మార్ఫింగ్ చేశారని నిర్ధారిస్తుంది.

ఇంకా, మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము మరియు 2018లో DNA మరియు ESPN Cricinfo ప్రచురించిన ఒరిజినల్ ఫోటోను కనుగొన్నాము. అదే వ్యక్తి అదే వేషధారణలో “సారీ సచిన్ సార్ అయితే M.S. ధోనీ నాకు క్రికెట్ దేవుడు... #7." అని కనిపించాడు.


పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్‌కు ఓ అభిమాని మద్దతు తెలిపిన వైరల్ ఫోటో మార్ఫింగ్ చేసినట్టు స్పష్టమవుతోంది. ఈ ఫోటో ఇటీవల రాంచీలో జరిగిన ఇండియా Vs న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్‌లోనిది కాదు. వైరల్ దావా ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.


Claim Review:భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ లో అభిమాని బాబర్ ఆజమ్ ను పొగుడుతూ ప్లకార్డు పట్టుకున్నాడా?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story