FackCheck : అయ్యప్ప స్వాములు దాడిచేసింది నరేష్ పై కాదు, వీడియోలో ఉన్నది బాలరాజు
Misleading Video Shared As Bairi Naresh On Social Media And On News Channels. అయ్యప్య స్వామిపై అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు
By Nellutla Kavitha Published on 3 Jan 2023 1:24 PM ISTఅయ్యప్య స్వామిపై అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు పరుగెత్తించి కొట్టారు అన్న వీడియో సోషల్ మీడియాతో పాటుగా వివిధ వెబ్ సైట్లు, న్యూస్ ఛానళ్లలో కూడా ప్రసారం అయింది.
హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను కోస్గిలో అయ్యప్ప భక్తులు చితకబాదారు. నరేష్‌ను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు అని డిసెంబర్ 30న వివిధ వార్తా సంస్థలు ఈ వార్తను ప్రచురించాయి.
నిజనిర్ధారణ :
కోస్గిలో దాడి జరిగింది బైరి నరేష్ మీదనేనా తెలుసుకునేందుకు ఫాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఇందుకోసం కీ వర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు యూట్యూబ్ లో వికారాబాద్ ఎస్ పి కోటిరెడ్డి ఇంటర్వ్యూ కనిపించింది. టీవీ9 కూడా వికారాబాద్ పోలీసుల అదుపులో బైరి నరేష్ ఉన్నాడని, కోస్గిలో అయ్యప్ప భక్తులు బైరి నరేష్ పై దాడి చేశారని ప్రసారం చేశారు. అయితే అదే లైవ్ ఫోన్ ఇన్ లో మాత్రం ఎస్పీ కోటిరెడ్డి, దాడి జరిగింది బైరి నరేష్ పై కాదని, నరేష్ ని అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఇక డిసెంబర్ 31, 2022న బైరి నరేష్‌ను వరంగల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటే ప్రోగ్రాం ఆర్గనైజర్ హనుమంతుని కూడా అరెస్టు చేసినట్టుగా వికారాబాద్ డిఎస్పి కోటి రెడ్డి తెలిపారు.
అయితే కోస్గిలో దాడిలో గాయపడిన వ్యక్తి ఎవరు ?! మరోసారి సెర్చ్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. దాడిలో గాయపడిన వ్యక్తి బాలరాజు అని తెలిసింది. కోస్గిలో నరేష్‌కు వ్యతిరేకంగా అయ్యప్ప భక్తులు చేస్తున్న ధర్నాను బాలరాజు వీడియోలు తీశాడు. దీంతో అయ్యప్ప భక్తులు బాలరాజును నరేష్ వర్గీయుడుగా భావించి దాడి చేశారు. దీనిని గమనించిన పోలీసులు వారి నుంచి బాలరాజును రక్షించి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
https://epaper.eenadu.net/Home/ShareImage?Pictureid=9865577
ఇక ఈ దాడి విషయాన్ని కోస్గి పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేశాడు బాలరాజు.
https://drive.google.com/file/d/1cwuWpCb-xaEKJoMHUA3IqDqsl-ShRl3K/view
సో, అయ్యప్య స్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. భైరి నరేష్‌ను పరుగెత్తించి కొట్టిన స్వాములు అనే ఈ వార్త నిజం కాదు.