Fact Check : గోధుమల మీద నీళ్లు చల్లుతున్న వ్యక్తికి.. రైతుల నిరసనలకు ఎటువంటి సంబంధం లేదా..?

man spraying water on wheat sacks falsely linked to 2020 farmers' protest. కొన్ని బస్తాల మీద ఓ వ్యక్తి నీటిని జల్లుతూ

By Medi Samrat  Published on  27 Jan 2021 4:00 AM GMT
fact check news of spraying water on wheat bags

కొన్ని బస్తాల మీద ఓ వ్యక్తి నీటిని జల్లుతూ ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఆ వ్యక్తి నీళ్లు జల్లుతోంది గోధుమల మీద అని చెబుతూ ఉన్నారు. అలా చేయడం వలన గోధుమలు పాడైపోతాయని.. ఇలా చేయడం పంజాబ్ రైతులకు అలవాటు అంటూ చెబుతూ పోస్టులు పెడుతూ ఉన్నారు. అలా చేస్తే గోధుమలను డిస్టిలరీలు మరియు బ్రూవరీలకు(మద్యం తయారు చేసే సంస్థలు) అమ్ముకోవచ్చని వారు అనుకుంటూ ఉన్నారని.. వీటిలో పెద్ద మాయ ఉందని చెబుతూ పోస్టులు పెడుతూ ఉన్నారు.



"This is the scene across Punjab, wheat bought at MSP, water is sprinkled on bags to make the grains rot then it is sold to distillery & breweries by the five star farmers who are agitating on the border of Delhi! Big money is involved??[sic]" అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టాడు.

'ఇలా గోధుమల మీద నీళ్లు జల్లడం పంజాబ్ మొత్తంలో చాలా సాధారణమని.. ఇలా గోధుమల మీద నీటిని జల్లి అవి కుళ్లిపోయేలా చేస్తారని.. ఆ తర్వాత వాటిని మద్యం కంపెనీలకు అమ్ముకుని బాగా ఎక్కువ డబ్బులు గడిస్తారు" అంటూ ఆరోపణలు గుప్పించడం జరిగింది. ఇలా ఎక్కువ డబ్బులు సంపాదించుకునే రైతులు ఇప్పుడు ఢిల్లీ బోర్డర్ లో నిరసన కార్యక్రమాలు చేపట్టారంటూ ఆరోపించారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వీడియోకు ప్రస్తుతం చోటు చేసుకుంటున్న రైతుల నిరసనాలకు ఎటువంటి సంబంధం లేదు.

ఈ వీడియో 2018లో హర్యానాకు చెందిన ఫతేహాబాద్ జిల్లాకు చెందినది. వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని సెర్చ్ చేయగా ABP News కు చెందిన న్యూస్ బులిటెన్ లో వీడియో కనిపించింది. మే 8, 2018న వీడియోను అప్లోడ్ చేశారు.


"Man spreads water on wheat sack to increase its weight". అంటూ వీడియోను అప్లోడ్ చేశారు. అంటే ధాన్యం బరువు ఎక్కువ తూగడానికి ఇలా నీటితో తడుపుతున్నాడని స్పష్టంగా అర్థం అవుతోంది. 2018 సంవత్సరం నుండి ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఉంది. కాబట్టి ఈ వీడియోకు రైతుల నిరసనకు ఎటువంటి సంబంధం లేదు.

ఫతేహాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి గోధుముల సంచుల మీద నీటిని పోస్తూ కెమెరాలకు దొరికిపోయాడు. ఫతేహాబాద్ మార్కెట్ లో గోధుమలను అమ్మాలని అనుకుని.. వాటిని నీటిలో తడిపితే బరువు ఎక్కువ వస్తుందనే అత్యాశతో ఇలా చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనపై మార్కెట్ కమిటీ విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్ కేసరి, న్యూస్ 18 హిందీలో కూడా ఈ ఘటనకు సంబంధించిన కథనాలు వచ్చాయి.


ఈ వైరల్ వీడియో హర్యానాలో చోటు చేసుకుంది. అంతేకానీ ప్రస్తుతం రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలతో ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.





Claim Review:గోధుమల మీద నీళ్లు చల్లుతున్న వ్యక్తికి.. రైతుల నిరసనలకు ఎటువంటి సంబంధం లేదా..?
Claimed By:Twitter User
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story