FactCheck : పాకిస్థానీ వలసదారుడు ప్యారిస్ లో మహిళను మెట్ల మీద నుండి తోసేశాడా.?

ప్యారిస్‌లో ఓ వ్యక్తి మహిళను మెట్ల మీద నుండి కిందకు తోసేస్తున్న వీడియో అంటూ కొందరు ఓ పోస్టును వైరల్ చేస్తున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 March 2024 8:30 PM IST
FactCheck : పాకిస్థానీ వలసదారుడు ప్యారిస్ లో మహిళను మెట్ల మీద నుండి తోసేశాడా.?

ప్యారిస్‌లో ఓ వ్యక్తి మహిళను మెట్ల మీద నుండి కిందకు తోసేస్తున్న వీడియో అంటూ కొందరు ఓ పోస్టును వైరల్ చేస్తున్నారు. ఆ పనికి పాల్పడింది పాకిస్థానీ వలసదారుడని ప్రచారం చేస్తున్నారు. ఓ వ్యక్తి మహిళను మెట్లపై నుంచి కిందకు తోసేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

"పాకిస్తాన్ కు చెందిన వలసదారు మొహమ్మద్ టాకీ ప్యారిస్‌లో మహిళను మెట్ల మీద నుండి కిందకు నెట్టినందుకు ఆ దేశం నుండి బహిష్కరించబడ్డాడు, (sic)" అని వీడియోను పోస్ట్ చేసిన ట్విట్టర్ వినియోగదారు రాశారు.

నిజ నిర్ధారణ :

వీడియోలో ఉన్న వ్యక్తి స్పెయిన్‌కు చెందిన వ్యక్తి. పాకిస్థానీ వలసదారు కాదని మేము గుర్తించాం. కాబట్టి ఆ వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుగొంది.

కీవర్డ్ సెర్చ్‌ను నిర్వహించగా.. మే 5, 2021 నాటి స్పానిష్ మీడియా అవుట్‌లెట్‌లో‘Spaniard deported after pushing a woman down the stairs of Paris metro’ అని ఉంది. ఒక మహిళను పారిస్ మెట్రో మెట్లపైకి నెట్టారనే నివేదికను మేము కనుగొన్నాము.

యూరో వీక్లీ న్యూస్ నివేదిక ప్రకారం.. పారిస్‌లోని పోర్టే డి లా చాపెల్లె స్టేషన్ మెట్ల పైభాగంలో స్పెయిన్‌కు చెందిన ఒక వ్యక్తి దూకుడుగా ప్రవర్తించినట్లు ఆ వీడియో చూపిస్తుంది. ఆ వ్యక్తి మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా.. ఆ మహిళ అతనితో గొడవ పడింది. అతనిని ఆ మహిళ మొదట కొట్టింది. వెంటనే ఆ వ్యక్తి కోపంతో.. మెట్రో స్టేషన్‌లోకి వెళ్లే మెట్ల పై నుండి ఆమెను కిందకు నెట్టివేశాడు.

అదే వీడియోను యూట్యూబ్ ఛానెల్‌లో.. ‘French Cops Arrest Man That Pushed Woman Down Steps’ అనే టైటిల్ తో వీడియోను పోస్ట్ చేశారని మేము గుర్తించాం. ఫ్రెంచ్ పోలీసులు మహిళను తోసిన వ్యక్తిని అరెస్ట్ చేశారనే టైటిల్ తో వీడియోను అప్‌లోడ్ చేసినట్లు కూడా మేము కనుగొన్నాము. వీడియో వివరణలో నిందితుడిని ఓస్నీలోని రోమా క్యాంప్ వద్ద పోలీసులు అరెస్టు చేశారని తేలింది. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.

చివరగా, మే 5, 2021 నాటి.. స్పానిష్ మీడియా అవుట్‌లెట్ మలాగో హోయ్‌పై మీడియా నివేదికను కూడా మేము కనుగొన్నాము.

మహిళను మెట్లపై నుంచి తోసేస్తున్న వ్యక్తి పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి కాదని, స్పెయిన్ దేశస్థుడని మా విచారణలో తేలింది.

Credit : Sunanda Naik

Claim Review:పాకిస్థానీ వలసదారుడు ప్యారిస్ లో మహిళను మెట్ల మీద నుండి తోసేశాడా.?
Claimed By:X Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:False
Next Story